బట్టలిప్పిన కేసులో మల్లికా షెరావత్ కి వారెంట్
న్యూ ఇయిర్ వేడుకలు కోసం ఆమె చాలా హాట్ హాట్ గా కనపడటం కోసం ఒంటిపై బికినీ వేసుకుని డాన్స్ చేసింది. ఆ బికినీ కోసం చాలా చిన్నది అంటే రెండు పీలికలు మాత్రమే ఉండటంతో ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. బరోడా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్ష్యుడు నరేంద్ర తివారి ఆమెపై కోర్టులో పిటీషన్ ధాకలు చేసారు.
ఈ కేసులో భాగంగా ఆమె కోర్టుకు హాజరు కావాలంటే గుజరాత్ లోని వడోదర జిల్లా న్యాయస్ధానం మల్లికకు సమన్లు జారి చేసింది. అయితే మల్లిక గైర్హాజరు కావటంతో కోపం వ్యక్తం చేసిన న్యాయస్ధానం ఆగస్టు 19న హాజరు కావాలంటూ వారెంట్ జారీ చేసింది. ఆమె ఆ రోజు కోర్టుకు హాజరు కాకపోతే అరెస్టు చేసే అవకాసం ఉంది.
ఇక ప్రస్తుతం మల్లిక ...రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' జీవితం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించబోతోంది. గ్లామర్‌కి ఆస్కారం లేని పాత్రలో పిడకలు చేసుకొంటూ కెమెరా ముందు నటిస్తోంది.
ఇక ఈ చిత్రం టైటిల్ 'డర్టీ పాలిటిక్స్'. రాజస్థాన్‌లో రెండేళ్ల కిందట వెలుగుచూసిన భన్వరీదేవి ఉదంతం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కె.సి.బొకాడియా దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరికి చెందిన గృహిణిగా మల్లిక పాత్ర ఉంటుంది. కొందరు రాజకీయ నాయకుల మూలంగా ఆమె జీవితం ఎలా ఇబ్బందులు పాలైందో చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications












