కల్కి 2898 AD, ఇండియన్ 2 ల్లో కమల్‌పై ఒకే తరహా సీన్లు.. క్లైమాక్స్ రిపీట్ యాదృచ్చికమేనా?

ఇప్పుడు సినిమాల్లో నటీనటుల పెర్ఫామెన్ లకి స్కోప్ చాలా తక్కువ కనిపిస్తుంది అంటే అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రెజెంట్ ఉన్న కొత్త జెనరేషన్ స్టార్స్ లో తమ పెర్ఫామెన్స్ లతో అదరగొట్టే హీరోలు చాలా చాలా తక్కువే కనిపిస్తారు. అయితే అసలు ఇది కాదు నటన అని కొందరు సినీ ప్రేమికులు మాటాడుకుంటూ ఉంటారు. భారతీయ సినిమా దగ్గర నటనతో వన్నె తీసుకొచ్చిన దిగ్గజ తారల కోసం మాట్లాడాలి అంటే కొన్ని దశాబ్దాలే వెనక్కి వెళ్లి తీరాలి.

మరి ఆ సమయంలో ఉన్న లెజెండరీ నటులు ఇప్పుడు ఇండియా సినిమా వైడ్ గా ఉన్న వారు అంతా మళ్ళీ తమ పీక్ లోకి వస్తున్నారని చెప్పవచ్చు. గడిచిన కొన్నేళ్లలో కోలీవుడ్ నుంచి కమల్ హాసన్, రజినీకాంత్ లు కం బ్యాక్ లు కొట్టారు. మన తెలుగు సినిమాలో కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సహా వెంకటేష్ లు కూడా తమ రీసెంట్ సినిమాలతో మళ్ళీ పుంజుకున్నారు.

Was kamal Haasan in Six Pack Scene kalki 2898 AD and indian 2 Climax coincident

తాజాగా బాలీవుడ్ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్ కూడా 8 పదుల వయసులో ఉన్నా కూడా కల్కి సినిమాలో అశ్వథామునిగా తన అభిమానులకి వింటేజ్ ట్రీట్ ని ఇచ్చారు. ఇలా సీనియర్ హీరోలు అదరగొడుతున్నారు. అయితే వీరి అందరిలో కూడా ఉలగనయగన్ కమల్ హాసన్ కోసం ప్రత్యేకంగా చెప్పాలి. కమల్ నటుడిగా ఎలాంటి పెర్ఫామర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్ర ఏదైనా పాదరసంలా తాను పట్టేస్తారు కమల్.

ఇలా తాను ఈ వయస్సులో కూడా ప్రొస్థెటిక్ మేకప్ లతో డిఫరెంట్ గెటప్స్ చేస్తూ మెప్పిస్తున్నారు. కాగా తన నుంచి రెండు సినిమాలు ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. ఒకటి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో చేసిన చిత్రం కల్కి లో కమల్ విలన్ గా నటించారు. అలాగే ఇంకో సినిమా =దర్శకుడు శంకర్ తో చేసిన భారీ చిత్రం "భారతీయుడు 2" తో వచ్చారు.

Was kamal Haasan in Six Pack Scene kalki 2898 AD and indian 2 Climax coincident

అయితే భారతీయుడు 2, కల్కి క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో కమల్ పై ఓ పాయింట్ యాదృచ్చికంగా కలిసింది అని చెప్పవచ్చు. కల్కి క్లైమాక్స్ లో కమల్ పై షర్ట్ లెస్ సీక్వెన్స్ తాను బలవంతుడుగా మారుతున్నప్పుడు చూపించే సన్నివేశంలో ఇంట్రెస్టింగ్ గా 6 ప్యాక్ బాడీతో కమల్ ని చాలా బలంగా చూపించారు. కాగా ఇప్పుడు మళ్ళీ భారతీయుడు 2 క్లైమాక్స్ ఫైట్ లో కూడా షాకింగ్ సీక్వెన్స్ ని పెట్టి శంకర్ వావ్ అనిపించారు.

చాలా నాచురల్ ప్రొస్థెటిక్ మేకప్ తో కమల్ ని 6 ప్యాక్ తాతయ్యగా చూపించడం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఎప్పుడో యంగ్ హీరోలు స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ లో ఇప్పుడు కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అది కూడా క్లైమాక్స్ పోర్షన్ లలోనే కనిపించడం అనేది ఒకింత యాదృచికంగా అనిపిస్తుంది అని చెప్పవచ్చు. కాగా ఇపుడు కల్కి, భారతీయుడు 2 సినిమాలు థియేటర్స్ లో ప్రదర్శించబడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X