పవన్‌ను సైకిల్ ఎక్కించి.. త్రివిక్రమ్ ఇమేజ్ పెంచాడా? పరువు తీశాడా?
Recommended Video

జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల్లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంపై ఫ్యాన్స్ నుంచి సానుకూల స్పందన, ప్రేక్షకుల నుంచి ప్రతికూలత వ్యక్తమవుతున్నది. ఇలా డివైడ్ టాక్‌తో దూసుకెళ్తున్న అజ్ఞాతవాసి చిత్రంలోని ఓ సన్నివేశంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. అదేమిటంటే..

సైకిల్‌పై పవన్ కల్యాణ్ ఆట
అజ్ఞాతవాసి కథలో భాగంగా ఏబీ అనే కంపెనీలో పవన్ కల్యాణ్ సైకిల్ ఎక్కి మురళీశర్మను ఆటపట్టిస్తాడు. భయపడేలా సైకిల్‌పై వెంటాడుతాడు. సినిమాలో ఆ సీన్ కీలకంగా మారుతుంది.

పవన్ కల్యాణ్ సైకిల్ ఛేజ్
పవన్ కల్యాణ్ సైకిల్ ఎక్కి మురళీ శర్మను ఛేజ్ చేయడాన్ని చూసి ‘చిన్నప్పటి నుంచి ఆ అల్లుడి (పవన్‌ను ఉద్దేశించి)కి ఉన్న సైకిల్ మోజు ఇంకా కొనసాగుతునే ఉంది అని తనికెళ్ల భరణి ఓ కామెంట్ విసురుతాడు.

పవన్ మళ్లీ సైకిల్ ఎక్కుతాడా?
అలాగే ఓ సందర్భంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మళ్లీ సైకిల్ ఎక్కుతాడా? అని వర్మ (రావు రమేష్)తో మురళీశర్మ అంటాడు. అందుకు సమాధానంగా వర్మ బదులిస్తూ.. వాడు ఏది ఎక్కినా ఫర్వాలేదు. మనల్ని ఎక్కుకుండా ఉంటే చాలూ అని అంటాడు.

త్రివిక్రమ్ రాజకీయ కోణం
అజ్ఞాతవాసి చిత్రంలోని త్రివిక్రమ్ రాసిన ఈ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎందుకంటే .. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్. ఆ పార్టీకి గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మద్దతు తెలిపింది.

ఏపీలో జనసేన మద్దతు
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి జనసేన మద్దతు ప్రధాన కారణమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు తెలుపుతుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

త్రివిక్రమ్ ఉద్దేశపూర్వకంగానే
జనసేన, తెలుగుదేశం పార్టీ మైత్రి ఉద్దేశించి దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సైకిల్ ప్రస్తావన తెచ్చాడా?. అజ్ఞాతవాసి చిత్రంలో సైకిల్ ఎపిసోడ్‌ను మరీ అంతగా సాగదీశాడు? అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

సైకిల్ ప్రస్తావన సమంజసమేనా
మళ్లీ సైకిల్ ఎక్కుతాడా అనే డైలాగ్ విషయాన్ని సీరియస్‌గా పరిశీలిస్తే.. జనసేన ఒంటరిగా పోటీ చేయదా? మళ్లీ సైకిల్ పార్టీకి మద్దతు తెలుపుతాడా? అని సందేహం కలిగే విధంగా ఉండటంపై కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ సినిమాలో సైకిల్ ప్రస్తావన ఎంత వరకు సమంజసం అనే వాదనను వినిపిస్తున్నారు.

డబుల్ మీనింగ్ డైలాగ్స్
జనసేన పార్టీ సొంత బలాన్ని కూడగట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సైకిల్ ప్రస్తావన సినిమాలో పెట్టడం పవన్‌ను కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ఫ్యాన్స్‌లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











