సుస్మితా సేన్ అందాలకు పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీం బౌల్డ్
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ అందాలకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ బౌలర్ వసీం వక్రీం ఫిదా అయ్యారు. ఆమె సొగసులకు బౌల్డ్ అయ్యారు. ప్రపంచంలోనే సుస్మితా సేన్ అందమైందని, ఆమె అందాలకు ప్రపంచంలో ఒక్కరు కూడా పోటీకి తగరని ఆయన అన్నారు. అవకాశం వస్తే సుస్మితా సేన్ తో నటిస్తానని అంటున్నారు. అయితే, ఆమెతో గతంలో తాను సంబంధాలను నెరిపి పీకలోతు కూరుకుపోయినట్లు జరిగిన ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. అదేం లేదని దులిపేసుకున్నారు. ఓ వ్యక్తిని మరో వ్యక్తి కలిసినట్లుగా సుస్మితాను తాను రెండు మూడుసార్లు కలిశానని, అది రిలేషన్ షిప్ కిందికి రాదని వసీం అంటున్నారు. ఏమైనా, సుస్మితా అంటే వసీం పడి చస్తున్నట్లు మాత్రం అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











