»   » రోజుకొకటి చొప్పున: బాలయ్య 99 సినిమాలు. వంద రూపాయలకే, ధియోటర్ లో

రోజుకొకటి చొప్పున: బాలయ్య 99 సినిమాలు. వంద రూపాయలకే, ధియోటర్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మామూలుగా ఓ సింగిల్ మూవినీ ధియోటర్ లో ఈ రోజున చూడాలంటే మినిమం కాస్ట్ వంద రూపాయలు అయిపోయింది. అయితే 99 చిత్రాలను కేవలం వంద రూపాయలకే చూపటం అంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ. కానీ బాలయ్య అభిమానులు అది నిజం చేసి చూపెడుతున్నారు.

Watch 99 Films of Balayya for Rs 100 Ticket!

నందమూరి బాలకృష్ణకి ఉన్న అభిమానగణం గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన సినిమాలు ఈ గడ్డు రోజుల్లో కూడా 365 రోజులు ఆడుతున్నాయంటే అభిమానుల ఆదరణే కారణం. ప్రస్తుతం బాలయ్య తన వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి అనే చిత్రంలో నటిస్తోండగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నాడు.

అయితే ఈ క్రమంలో బాలకృష్ణ అభిమానులు కొందరు ఓ కొత్త స్కీమ్ వేసారు. దసరా.. దీపావళి.. మొహర్రం .. క్రిస్మస్ కానుకగా బాలకృష్ణ ఇంతవరకూ నటించిన 99 సినిమాలను రోజుకి ఒక ఆట చొప్పున ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొద్దుటూరులోని అర్చనాటాకీస్ ధియేటర్లో ఈ షోలు వేయనున్నారు. ఈ విషయాన్ని ఓనర్ ఓబుల్ రెడ్డి ఖరారు చేసారు.

Watch 99 Films of Balayya for Rs 100 Ticket!

కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన బాలయ్య అభిమానులు వినూత్నంగా ఈ ప్లాన్ చేస్తోండగా తమకు సహకరించనున్న అర్చన థియేటర్ యాజమాన్యానికి అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంక ఇక్కడ మరో విశేషం కూడా ఉంది, బాలకృష్ణ 99 సినిమాలను 100 రూపాయల ఖరీదు గల ఒకే టికెట్ పై చూపించటం. మామూలు విషయం కాదు కదా.

English summary
Management of Archana Theatre in Proddatur planned to screen all the 99 movies of Nandamuri Balakrishna. A film of Nata Simha will be screening per day. Its like a bumber offer for Nandamuri Fans for Dussehra, Divali, Moharam and Christmas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu