బాహుబలి: నిప్పులే శ్వాసగా సాంగ్, మేకింగ్ (వీడియో)
హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా విడుదల దగ్గర పడుతున్నీ కొద్దీ సినిమా ప్రమోషన్ల వేగం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా బాహుబలి సినిమాకు సంబంధించి ‘నిప్పులే శ్వాసగా' వీడియో సాంగ్, మేకింగ్ సంబంధించిన వీడియో విడుదల చేసారు. ఈ వీడియో సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది.
బాహుబలి పార్ట్ 1 ఒక్క తెలుగులోనే ఇప్పటి వరకు దాదాపు 83 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రిలీజ్ ముందే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగలేదు. శాటి లైట్ రైట్స్, ఇతర రైట్స్ ఇలా అన్ని కలిపి పార్ట్ 1 ఇప్పటికే 125 కోట్ల బిజినెస్ చేసింది. ఇక తెలుగు, తమిళం, మళయాలం, విదేశీ వెర్షన్లు కలిపితే ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించడం ఖాయం.
నైజాం : 22.5కోట్లు
సీడెడ్ : 12.6కోట్లు
ఉత్తరాంధ్ర: 7.2కోట్లు
గుంటూరు + నెల్లూరు: 9కోట్లు
ఈస్ట్ గోదావరి: 5.25కోట్లు
వెస్ట్ గోదావరి: 4.3కోట్లు
కృష్ణా: 4.5కోట్లు
టోటల్ ఏపి, తెలంగాణ: 65.35
కర్ణాటక: 8.6కోట్లు
ఓవర్సీస్: 9కోట్లు
వరల్డ్ వైడ్ తెలుగు వెర్షన్: 82.95 కోట్లు


Click it and Unblock the Notifications











