నాగబాబు కూతురు అదరగొడుతోంది.. (ఎపిసోడ్-3)

By Bojja Kumar

హైదరాబాద్: నాగ బాబు కూతురు నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ'కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే సంక్రాతికి తొలి ఎపిసోడ్ రిలీజ్ కాగా....రెండు వారాల గ్యాపుతో రెండో ఓపిసోడ్ రిలీజ్ చేసారు. ఈ రెండు ఎపిసోడ్లకు నెటిజన్ల నుండి స్పందన వచ్చింది. వీటికి ఇప్పటి వరకు దాదాపు 15 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. తాజాగా ‘ముద్ద పప్పు ఆవకావయ్' మూడో ఎపిసోడ్ రిలీజ్ చేసారు.

‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన నిహారిక ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రణీత్ బ్రామందపల్లి దర్శకత్వంలో ‘ముద్ద పప్పు ఆవకాయ్' తెరకెక్కుతోంది. మొత్తానికి నిహారిక మెగా ఫ్యామిలీ పేరు నిలబెడుతుందని అంటున్నారంతా. ఇందులో నిహారికకు జోడీగా ప్రతాప్ నటిస్తున్నాడు.

Watch Episode - 03 of Muddapappu Avakai

వర్ష, అదితి, హర్ష, మోహన్, ధనలక్ష్మి, లీరిషా, హుస్సేన్ షా కిరణ్, సంజీవ్, సంజన, వింధ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎవరికి వారు తమ పాత్రలకు అనుగుణంగా మంచి నటన చూపించారు. ముద్ద పప్పు ఆవకాయ వెబ్ సిరీస్ కు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: విద్యాసాగర్ & అఖిలేష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: నాని, ప్రొడక్షన్ హెడ్: నిఖిల్, అసిస్టెంట్ డైరెక్టర్స్: ప్రశాంత్, సాయి, మ్యూజిక్: కార్తీక్, దర్శకత్వం: ప్రణీత్ బ్రామందపల్లి.

నిహారిక హీరోయిన్ గా చేస్తున్న మూవీ డిటేల్స్...
నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఒక మనసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X