అమీర్ ఖాన్ ‘పికె’ ఫన్నీ వీడియో...
హైదరాబాద్: అమీర్ ఖాన్ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ ఫన్నీ వీడియో పోస్టు చేసాడు. ఈ వీడియో చూస్తే సినిమా కోసం అమీర్ ఖాన్ ఎంత ఎపర్టుతో పని చేసాడో అర్థమవుతుంది. సీన్ పర్ ఫెక్టుగా రావడానికి ఎన్ని టేకులు తీసుకోవడానికైనా వెనకాడని యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ ‘పికె' షూటింగులో కొన్ని సీన్ల కోసం చాలా టేకులు తీసుకున్నారట.
పికె చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 3 ఇడియట్స్ చిత్రం బాక్సాపీసు వద్ద బారీ విజయం సాధించింది. ఈ ఇద్దరి మళ్లీ కలిసి పని చేస్తుండటంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పెర్ఫార్మెన్స్, అప్పియరెన్స్ డిఫరెంటుగా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

తాజాగా అమీర్ ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసిన ఫన్నీ వీడియో అందరికీ ఆకట్టుకుంటోంది. అమీర్ ఖాన్, ఫ్యాట్ బార్బర్ మధ్య సాగే ఈ సీన్ అందరినీ తెగ నవ్విస్తుంది. పికె చిత్రం బారీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. డిసెంబర్ 16న సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











