లారెన్స్... 'గంగ (మని-3)' ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్ : ‘ఆత్మ కు ప్రేతాత్మకి యుద్దం, అది చూడటానికి ఊరు సిద్దం " అంటూ రాఘవ లారెన్స్ మరోసారి రెడీ అయ్యిపోయారు. హరర్ కామెడీ ప్రధానంగా రాఘవ లారెన్స్ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం కాంచన. ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ముని చిత్రానికి సీక్వెల్ కాంచన, మరి ఈ కాంచన సీక్వెల్ గంగ...ముని 3 అయితే ఇప్పుడు గంగ (మని-3) చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
చిత్రం ఏప్రియల్ 17న విడుదల చేస్తున్నారు. ఈ తరుణంలో హీరో దర్శకుడైన రాఘవ లారెన్స్ ఆ సినిమా తాలుకు ట్రైలర్ ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ ఆకట్టుకునేలా రూపొందించారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ముని 3 అంటూ టైటిల్‌పై పెట్టి కాంచన-2 అంటూ సినిమాపేరు ఉంచారు. ఓ రకంగా తెలుగు, తమిళంలో రూపొందుతున్న 3వ సీక్వెల్ సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు కలిగేలా చేశారు రాఘవ. పసుపుతో నిండిన ఫోటోలో భక్తుని రూపంలో చేతి నిండా గాయాలతో ఉంది ఫస్ట్‌లుక్ ఫోటో. ఇంకా ఈ చిత్రంలో తాప్సీ, నిత్యామీనన్‌లు నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాదికి పైగా శ్రమించారు. కాంచన-2కు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.ఈ చిత్ర ఆడియోను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ ఎన్నో హిట్ చిత్రాలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. తెలుగు, తమిళ చిత్రసీమల్లోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో ఆటాడించాడు. హీరో దర్శకుడిగా స్టెల్, ముని,కాంచన, సినిమాలతో విజయం అందుకున్నారు. దర్శకుడిగా నాగార్జునతో మాస్,డాన్ సినిమాలతో హిట్ కొట్టగా, యంగ్ రెబల్‌స్టార్‌తో చేసిన రెబల్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంచన-2తో మన ముందుకొస్తున్నారు. హరర్ కామెడీ చిత్రాలతో విజయాన్నందుకున్న రాఘవ కాంచన-2తో అంచనాలను అందుకుంటాడో లేదో వేచి చూడాలి.
రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











