హాట్ అండ్ సెక్సీ సీన్లుండబట్టే తెగ చూస్తున్నారు (వీడియో)
ముంబై: ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'హేట్ స్టోరీ-2' చిత్రం ట్రైలర్‌కు యూట్యూబులో మంచి స్పందన వస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన 4 రోజుల్లోనే 4 మిలియన్ల మంది వీక్షించారు. ట్రైలర్లో హాట్ అండ్ సెక్సీ సీన్లు ఉండటం వల్ల నెటిజన్లను, ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకర్షిస్తోంది.
సెక్స్ అండ్ క్రైం కథాంశాలతో కూడిన కథాంశాలకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. గతంలో ఈ తరహాలో వచ్చిన 'హేట్ స్టోరీ' అనే బాలీవుడ్ మూవీ విజయవంతం కావడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'హేట్ స్టోరీ-2' అనే చిత్రం వస్తోంది. టీవీ యాక్టర్ జయ్ భానుశాలి, పంజాబీ నటి సర్వీన్ చావ్లా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ల ఈ ఇధ్దరి మధ్య వచ్చే హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు శృంగార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో 'హేట్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన విక్రమ్ భట్ 'హేట్ స్టోరీ 2' ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. 'హేట్ స్టోరీ 2' చిత్రానికి విక్రమ్ భట్ అసిస్టెంట్ విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/1JY8rA7fVnU?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
తన జీవితాన్ని, ప్రేమను నాశం చేసిన ఒక వ్యక్తిపై ఓ మహిళ ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈచిత్రం సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ హాట్ బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఈచిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











