»   » ఫ్యాన్స్ పట్ల ఎందుకలా? గతంలో చిరంజీవి, ఇపుడు బాలయ్య, వీడియో వైరల్...

ఫ్యాన్స్ పట్ల ఎందుకలా? గతంలో చిరంజీవి, ఇపుడు బాలయ్య, వీడియో వైరల్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఓ వీడియో రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనతో ఫోటో దిగడానికి వచ్చిన ఓ అభిమాని పట్ల బాలయ్య కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాలయ్య తన సినిమా షూటింగులో ఉండగా కొన్ని అభిమాన బృందాలు వచ్చాయి. బాలయ్య వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఫోటోలు దిగారు. అయితే తన అభిమానుల బృందంతో సంబంధం లేని వ్యక్తి తనతో ఫోటో దిగడానికి రావడంతో బాలయ్య అతడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుండి వెళ్లిపో అంటూ ఫైర్ అయ్యారు.

కారణం ఏమిటి?

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే బాలయ్య ఇలా ప్రవర్తించడానికి కారణమని అంటున్నారు. కొందరు యాంటీ ఫ్యాన్స్ బాలయ్యతో ఫోటో దిగడానికి వచ్చి ఆయన్ను రాజకీయంగా వివాదాల్లోకి నెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని... అందుకే బాలయ్య అప్పటి నుండి తన అభిమానులు కాని వారిని దగ్గరకు రానివ్వడం లేదని అంటున్నారు. బాలయ్యది చాలా మంచి మనసు అని అంటున్నారు ఫ్యాన్స్.

విమర్శలు

విమర్శలు

అయితే బాలయ్య ప్రవర్తన సరిగా లేదని... అభిమానంతో ఫోటో దిగడానికి వచ్చిన వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని... బాలయ్య అభిమానులు కాని వారు అంటున్న మాట. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది.

చిరంజీవి

గతంలో చిరంజీవి కూడా ఓ అభిమాని పట్ల ఇలాగే ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తనను కావాలని పదే పదే ఇబ్బంది పెట్టిన అభిమాని పట్ల చిరంజీవి ఫైర్ అయ్యారు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అభిమానులంటే ఎవరికీ చేదు కాదు

అభిమానులంటే ఎవరికీ చేదు కాదు

వాస్తవానికి ఏ హీరోకు కూడా అభిమానులంటే చేదు కాదు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చింది వారే అనే కృతజ్ఞత భావం ప్రతి హీరో మనసులో ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు ఫ్యాన్స్ చేసే చర్యలు వారికి కోపం తెప్పించడం సహజం. ఎందుకంటే వారు కూడా భావోద్వేగాలు ఉన్న మనలాంటి మనుషులే కదా...

English summary
Watch How Balakrishna Receive His Fans. Nandamuri Balakrishna reportedly behaved rude with his fan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu