For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జై లవ కుశ’.... లవ కుమార్ చాలా సాఫ్ట్ (టీజర్)

    By Bojja Kumar
    |

    ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహస్తున్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు.

    జై, లవ, కుశ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 'జై' టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా లవ కుమార్ క్యారెక్టర్ పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. లవ కుమార్ బ్యాంక్ ఉద్యోగి. చాలా సాఫ్ట్ క్యారెక్టర్.

    మంచి తనమే అతడి వీక్ నెస్

    లవ కుమార్ బ్యాంకు ఉద్యోగి. అతడికి ‘మంచితనం' అనే వీక్ నెస్ ఉంది. అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం ఉంటుంది. అదే లవ కుమార్ జీవితాన్ని తలక్రిందులు చేస్తుందట సినిమాలో.

    భయంకరమైన పాత్ర జై

    భయంకరమైన పాత్ర జై

    సినిమాలో ‘జై' పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని.... అత్యంత కర్కశమైన విలనిజంతో కూడుకుని ఉంటుందని తెలుస్తోంది.

    జై టీజర్

    ‘జై' పాత్రకు కాస్త నత్తి కూడా ఉంటుందని ఈ టీజర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ వింటే స్పష్టమవుతుంది. ఈ రావణుడిని చంపాలంటే సముద్రమంత దదదధై...ర్యం ఉండాలి అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు.

    హీరోయిన్లు

    హీరోయిన్లు

    ఎన్టీఆర్ పోషిస్తున్న రెండు పాత్రలకు రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఒక పాత్రకు హీరోయిన్ లేదని తెలుస్తోంది.

    English summary
    Watch Jai Lava Kusa Teaser .. NTR as LAVA. Cast: Jr NTR, Rashi Khanna, Nivetha Thomas, Ronit Roy, Posani Krishna Murali, Brahmaji, Pradeep Rawat, Jayprakash Reddy, Prabhas Sreenu, Praveen, Hamsa Nandini.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X