Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
‘జై లవ కుశ’.... లవ కుమార్ చాలా సాఫ్ట్ (టీజర్)
‘జై లవ కుశ’ మూవీ లవ కుమార్ టీజర్ రిలీజైంది. లవ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహస్తున్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు.
జై, లవ, కుశ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 'జై' టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా లవ కుమార్ క్యారెక్టర్ పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. లవ కుమార్ బ్యాంక్ ఉద్యోగి. చాలా సాఫ్ట్ క్యారెక్టర్.
మంచి తనమే అతడి వీక్ నెస్
లవ కుమార్ బ్యాంకు ఉద్యోగి. అతడికి ‘మంచితనం' అనే వీక్ నెస్ ఉంది. అది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది, మనలో ఉంటే గుణపాఠం ఉంటుంది. అదే లవ కుమార్ జీవితాన్ని తలక్రిందులు చేస్తుందట సినిమాలో.
భయంకరమైన పాత్ర జై
సినిమాలో ‘జై' పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని.... అత్యంత కర్కశమైన విలనిజంతో కూడుకుని ఉంటుందని తెలుస్తోంది.
జై టీజర్
‘జై' పాత్రకు కాస్త నత్తి కూడా ఉంటుందని ఈ టీజర్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ వింటే స్పష్టమవుతుంది. ఈ రావణుడిని చంపాలంటే సముద్రమంత దదదధై...ర్యం ఉండాలి అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు.
హీరోయిన్లు
ఎన్టీఆర్ పోషిస్తున్న రెండు పాత్రలకు రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఒక పాత్రకు హీరోయిన్ లేదని తెలుస్తోంది.