హృతిక్ రోషన్ క్రిష్-3 ట్రైలర్ (వీడియో)
ముంబై : హృతిక్ రోషన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్రిష్-3 ట్రైలర్ ఎట్టకేలకు రిలీజైంది. రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.
గతంలో రూపొందిన రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. క్రిష్-3 చిత్రంలో హృతిక్ రోషన్ సూపర్ మేన్ పాత్రలో కనిపించబోతునప్నాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈచిత్రం విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని ఈ ట్రైలర్ ను బట్టి స్పష్టం అవుతోంది. దీపావళికి ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












