అమీర్ ఖాన్ ‘పికె’ సాంగ్ మేకింగ్ ఇలా... (వీడియో )
హైదరాబాద్: అమీర్ ఖాన్, సంజయ్ దత్, అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘పికె' చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ లుక్ డిఫరెంటుగా ఉండటం కూడా సినిమాపై అంచనాలు పెంచేలా చేస్తోంది.

ఇటీవలే చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్...‘తర్కి చోక్రే' విడుదల చేసారు. అమీర్ ఖాన్, సంజయ్ దత్‌లపై చిత్రీకరించిన ఈ సాంగు ఆకట్టుకుంటోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే జైల్లో ఉన్నందున సంజయ్ దత్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేక పోతున్నాడు. తాజాగా నిర్మాతలు ఇదే సాంగుకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేసారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
పికె చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అమీర్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వచ్చిన 3 ఇడియట్స్ చిత్రం బాక్సాపీసు వద్ద భారీ విజయం సాధించింది. ఈ ఇద్దరు మళ్లీ కలిసి పని చేస్తుండటంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పెర్ఫార్మెన్స్, అప్పియరెన్స్ డిఫరెంటుగా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
తాజాగా అమీర్ ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసిన ఫన్నీ వీడియో అందరికీ ఆకట్టుకుంటోంది. అమీర్ ఖాన్, ఫ్యాట్ బార్బర్ మధ్య సాగే ఈ సీన్ అందరినీ తెగ నవ్విస్తుంది. పికె చిత్రం బారీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. డిసెంబర్ 16న సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











