twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు టాప్ సంగీత దర్శకులు, సింగర్స్ కలిసి పాడారు(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్: హుద్‌హుద్‌ పెను తుపాను బాధితుల సహాయార్థం నిర్వహించబోతున్న ‘మేము సైతం' కార్యక్రమం సమయం దగ్గరపడుతోంది. ఈ నేపధ్యంలో తెలుగు పరిశ్రమలోని నేపధ్య గాయకులు, సంగీత దర్శకులు కలిసి ఓ పాట పాడారు. ఈ పాటలో మీరు మణిశర్మ, కోటి, ఆర్.పి పట్నాయిక్, రమణ గోగుల, వందేమాతరం శ్రీనివాస్, చక్రి, ఎమ్ ఎమ్ శ్రీలేఖ, కె.ఎమ్ రాధాకృష్ణ, రఘు కుంచె, సునీత, సుమంగళి, విజయ లక్ష్మి, కౌసల్య, కళ్యాణ్ మాలిక్, స్మిత, నిత్య సంతోషిణి పాడారు. మీరూ ఆ పాటను వినండి..చూడండి.

    ఇక ''హుద్‌ హుద్‌ తుపాను బాధిత ప్రాంతాల సహాయార్థం చిత్ర పరిశ్రమ తలపెట్టిన 'మేము సైతం' కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. పరిశ్రమ, ప్రేక్షకులు ఒక బాధ్యతగా భావించి ముందుకు రావాల''ని కోరారు తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్‌. ఈ నెల 30న హైదరాబాద్‌లో 12 గంటలపాటు 'మేముసైతం' పేరుతో వినోద కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు.

    ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ ''రూ: 500ల టికెట్టు కొనడమే కాదు... సహృదయంతో ఎంతయినా సహాయం చేయొచ్చు. హుద్‌ హుద్‌ తుపాను నిధి ఖాతాకు తమ విరాళాల్ని పంపవచ్చు'' అన్నారు.

    Watch Memu Saitam Anthem sung by all Music Directors and Singers in Tollywood.

    అలాగే... హుద్‌హుద్‌ పెను తుపాను బాధితుల సహాయార్థం నిర్వహించబోతున్న ‘మేము సైతం' కార్యక్రమంలో భాగంగా మెగా తంబోలా ఈవెంట్‌ను డిజైన్‌ చేశామని క్రియేటివ్‌ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్‌. రామారావు చెప్పారు.

    ఆయన మాట్లాడుతూ ‘‘ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ తంబోలా కమిటీ ఆధ్వర్యంలో ఈ తంబోలా ఈవెంట్‌ను డిజైన్‌ చేశాం. 29వ తేదీ రాత్రి నేషనల్‌, ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ మోడల్స్‌తో షో ఏర్పాటు చేశాం. 30న మోహన్‌బాబు ఫ్యామిలీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీ జరుగుతుంది. రూ.15 వేల విలువ చేసే పాస్‌లు తీసుకున్న వాళ్లకు అదే రోజు రాత్రి 6.30 నుంచి రెండు గంటల పాటు జరిగే ‘తంబోలా విత్‌ స్టార్స్‌' ఈవెంట్‌లో తారలతో కలిసి తంబోలా ఆడే చక్కని అవకాశం ఉంటుంది. ఓ సదుద్దేశంతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో వీలైనంత ఎక్కువమంది పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం'' అని చెప్పారు.

    తంబోలాలో పాల్గొన్న వాళ్లకు రూ. 10 లక్షల బంపర్‌ప్రైజ్‌ ఉందని కమిటీ సభ్యురాలు విజయశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్‌ తుమ్మల రంగారావు, సభ్యులు బాలభాను తదితరులు పాల్గొన్నారు.

    ముఖ్యంగా తెలుగు నుంచి స్టార్ హీరోలు మహేష్, పవన్,ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. మరి వారు ఏ పోగ్రాంలు చేయబోతున్నారు అంటే...ఎన్టీఆర్ క్రికెట్ ని, పవన్,మహేష్ స్కిట్ లను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

    ఈ "క్రికెట్ టోర్నమెంట్" లో ఎన్టీఆర్, అఖిల్, వెంకటేష్, శ్రీకాంత్, తరుణ్ తదితరులు పాల్గొంటారు. దాదాపు ఆరు గంటల సేపు ఈ మ్యాచ్ జరగనుందని సమాచారం.నవంబర్ 30న జరగనున్న ఈ మ్యాచ్ కి సంబదించిన టికెట్స్ ని బుక్ మై షో లో అమ్మనున్నారు. ఈ మ్యాచ్ టికెట్ ధరం 3000 రూపాయలు.

    తెలుగు పరిశ్రమ లోని యంగ్ హీరోస్ అంతా 4 టీమ్స్ గా విడిపోయి ఈ మ్యాచ్ ఆడనున్నారు. ప్రతి టీంలోనూ 6 మంది ప్లేయర్స్ ఉంటారు, అందులో 4 హీరోస్ ఉంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అలాగే ప్రతి మ్యాచ్ కి 6 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఈ క్రికెట్ మ్యాచ్ మొత్తానికి హెడ్ గా వెంకటేష్ వ్యవహరించనున్నాడు.

    మరో ప్రక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్,మహేష్ ఓ స్కిట్ లో పాల్గొననున్నారు. ఈ నేపధ్యంలో ఈ పోగ్రాం ట్రాన్సిమిషన్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫైనల్ గా జెమినీ టీవి వారు ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నారు.

    ఈ పోగ్రాం.. నవంబర్ 30న హైదరాబాద్ లో జరగనుంది. దాదాపు 13 గంటల పాటు కంటిన్యూగా జరిగే లైవ్ ప్రోగ్రాం. దాంతో గత కొద్ది రోజులుగా ‘మేము సైతం' ప్రోగ్రాంని ప్రత్యక్ష ప్రసారం చేసే రైట్స్ కోసం తెలుగులో నాలుగు పెద్ద ఎంటర్టైనింగ్ చానల్స్ పోటీ పడినట్లు సమాచారం. అవి... ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ మరియు జీ టీవీ. అయితే చివరికి జెమిని టీవీ వారు మేము సైతం ప్రత్యక్ష ప్రసార రైట్స్ ని ఓ భారీ మొత్తానికి దక్కించుకున్నారు. ఎంత మొత్తమన్నది తెలియరాలేదు.

    ఇక ఈ పోగ్రాం లోగో విషయానికి వస్తే...సహాయం అందించడానికి సిద్దంగా ఉన్న చేతులను ఒక చెట్టు ఆకారంలో పొందుపరిచారు. కింద మేము సైతం అక్షరాలను, చెట్టును గ్రీన్, బ్లూ కలర్ లో రాశారు. సింబాలిక్ గా గ్రీన్ కలర్లో రాయడం అంటే విశాఖ పర్యావరణం అభివృద్ధికి, పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తాం, శక్తిని ఇస్తాం అని అర్ధం. బ్లూ కలర్లో రాయడం అంటే త్రికరణ శుద్ధితో, మనస్పూర్తితో, నిజాయితిగా పని చేస్తున్నాం. మీలో విశ్వాసాన్ని నింపుతాం అని అర్ధం. లోతుగా అధ్యయనం చేసి ఆలోచించిన తర్వాత ఈ లోగోను రూపొందించినట్టు చెప్తున్నారు.

    నవంబర్ 30వ తేదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ స్టార్ నైట్ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు మొదలైన వారు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. తెలుగు పరిశ్రమ ప్రముఖులతో తమిళ పరిశ్రమ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు. నవంబర్ 30న టాలీవుడ్ కి సెలవు ప్రకటించారు.

    English summary
    Music Directors & Singers : Mani Sharma, Koti, R.P. Patnaiak, Ramana Gogula, Vandemayaram Srinivas, Chakri, MM. Srilekha, KM. Radhakrishna, Raghu Kunche, Sunitha, Sumangali, Vijaya Lakshmi, Kousalya, Kalyani Malik, Smitha, Nitya Santoshini
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X