‘ఎన్టీఆర్-కథానాయకుడు’ పైరసీ అరికట్టాలని బాలయ్య పిలుపు
తెలుగు సినిమా ఇండస్ట్రీని పీడిస్తున్న సమస్యల్లో పైరసీ ప్రధానంగా చెప్పుకోవచ్చు. స్టార్ హీరోల సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు దీని వల్ల చాలా నష్టపోతున్నాయి. తియేటర్లో తొలి షో పడిన కొన్ని గంటల్లోనే పైరసీ ఇంటర్నెట్లో దర్శనమిస్తోంది.
తన తాజా చిత్రం 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9న విడుదలవుతున్న నేపథ్యంలో పైరసీ అరికట్టాలని బాలయ్య పిలుపునిచ్చారు. ఈ చిత్రాన్ని మీ దగ్గరలోని థియేటర్లలో చూడండి, పైరసీని అరికట్టాలని అభిమానులను కోరారు.
మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతుండగా మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న, రెండో భాగం 'ఎన్.టి.ఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.

ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్‌బికె ఫిల్మ్స్ నిర్మాణంలో వారాహి చలన చిత్రం సమర్పణలో ఈ బయోపిక్ విడుదల కాబోతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











