‘కెమెరామెన్ గంగతో..’ మసాలా ఐటం సాంగ్(వీడియో)
హైదరాబాద్: పవన్ గత సినిమా 'గబ్బర్ సింగ్' తెలుగు సినిమా చరిత్రను తిరగరాయడంతో ఆయన హీరోగా వస్తున్న 'కెమెరామన్ గంగతో రాంబాబు' చిత్రంపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన 'పవ పవ పవన్ కళ్యాణ్', 'ఎక్స్‌ట్రార్డినరీ' సాంగులకు మంచి రెస్పాన్ వస్తోంది.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఐటం సాంగ్ 'జరమొచ్చింది' వీడియో ప్రోమో విడుదలైంది. ఈ సాంగులో పవన్ కళ్యాణ్ విదేశీ భామ స్కార్లెట్ విల్సన్‌తో కలిసి స్టెప్పులేసాడు. ఈ సాంగుకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏది ఏమైనా ఈచిత్రం ఆడియో హిట్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా బంపర్ హిట్ కావుతుందనే నమ్మకం అటు దర్శక నిర్మాతల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ వ్యక్తం అవుతోంది.
జరమొచ్చింది ఐటం సాంగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జరమొచ్చింది ఐటం సాంగును సారధి స్టూడియోలో వేసిన సెట్లో చిత్రీకరించారు. క్యాచీ లిరిక్స్, ట్రెండీ మ్యూజిక్, ఫన్సీ స్టెప్స్, బ్యూటిఫుల్ కాస్టూమ్స్‌తో సాగుతూ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఐటం సాంగుల విషయంలో తనదైన మార్కును చూపించే పూరి ఈ చిత్రంలో కూడా మరోసారి తన పని తనం కనబర్చాడు.
ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











