అదిరింది : ఛార్మీ,పూరి ‘జ్యోతి లక్ష్మి’ ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్: ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్, శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకాలపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం పూర్తైంది అయింది. ఈరోజు ఈ చిత్రం ఆడియో విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఈ ట్రైలర్ ని ఇక్కడ వీక్షించండి...
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రంలో టైటిల్ పాత్రను ఛార్మి పోషిస్తోంది. పూర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని తెరరెక్కిస్తున్నారు. ఈ టీజర్ చూస్తుంటే.... ఇది స్త్రీ వాద సినిమాగా స్పష్టమవుతోంది. స్త్రీ జాతిపై మగజాతి ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుందని టీజర్లో విడుదల చేసిన లైన్స్ చూస్తే స్పష్టం వుతోంది.
జ్యోతి లక్ష్మి సినిమా అనగానే ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించి అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి ‘జ్యోతి లక్ష్మి' కాన్సెప్టు ఇది కాదని స్పష్టమవుతోంది. యాక్షన్ కూడా ఈ టీజర్ లో మిక్స్ చేసి వదిలి సినిమాపై ఆసక్తి రేపారు.

పేరు క్యాచీగా ఉండాలని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుందని అది ఓకే చేశామని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిలక్ష్మి నిజ జీవితానికి సంబంధం లేదని పేర్కొన్నారు.
ఛార్మి కౌర్, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











