రొమాంటిక్ సాంగులో అదరగొట్టిన ఇలియానా (వీడియో)
హైదరాబాద్: హాట్ బ్యూటీ ఇలియానా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘హ్యాపీ ఎండింగ్'. సైఫ్ అలీ ఖాన్ హీరో. రొమాంటిక్ కామెడీగా రానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలు, వీడియోలు, సాంగ్ ప్రమోలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన జైసా మేరా తు సాంగ్ ఆకట్టుకుంటోంది. సైఫ్‌తో రొమాన్స్ చేస్తూ చాలా ఇలియానా అదరగొట్టిందని అంటున్నారు.
సౌత్ బ్యూటీ ఇలియానాకు ఈ సినిమా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోంది. గత రెండేళ్లుగా సక్సెస్ లేని సైఫ్, ఇలియానా...ఈ ఏడాది హ్యాపీ ఎండింగ్ ఇస్తుందని ఆశిస్తున్నారు. సినిమా ఎలా వుంటుందో తెలీదుగానీ.. రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లు ఈమెకు ఖాయమని అంటున్నారు. గతంలో వచ్చిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రాలకు ‘హ్యాపీ ఎండింగ్' తీసిపోదని అంటున్నారు.

గోవింద, ప్రీతిజింతా కూడీ ఈ చిత్రంలో మరో జంటగా కనిపించబోతున్నారు. రాజ్ నిడిమోరు- కృష్ణ డీకె డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ మన తెలుగు వారే కావడం విశేషం. ఈ సినిమా నవంబర్ 21న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











