హృతిక్ కోసం...రోడ్డెక్కిన రణవీర్ సింగ్, చిందులు (వీడియో)

By Bojja Kumar

ముంబై: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా బాలీవుడ్లో 'బ్యాంగ్ బ్యాంగ్' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు వినూత్న ప్రచారం కల్పించడంలో భాగంగా మరో బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ రంగంలోకి దిగాడు. ఒక రకంగా సాహసం చేసాడు.

‘క్రిష్' వేషధారణలో ముఖానికి మాస్క్ వేసుకుని ముంబైలోని రద్దీగా ఉండే ఓ రోడ్డుపైకి వెళ్లి ల్యాప్ టాప్‌లో పాట ప్లేస్తూ చిందులేసాడు. ముఖానికి మాస్క్ ఉండటంతో తొలుత అతన్ని ఎవరూ గుర్తు పట్టలేదు. చివర్లో మాస్క్ తీయడంతో అతను రణవీర్ సింగ్ అని అందరికీ అర్థమైంది. ఐ లవ్ యు హృతిక్ అంటూ వెంటనే అక్కడి నుండి పురుగెత్తి కార్లో వెళ్లిపోయాడు.

Watch Video: Bang Bang Dare Goes Crazy; Ranveer Dances In The Road

‘బ్యాంగ్ బ్యాంగ్' సినిమా విషయానికొస్తే...
ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కత్రినా, హృతిక్ మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. హాలీవుడ్లో టామ్ క్రూయిజ్-కామెరూన్ డియాజ్ నటించిన 'నైట్ అండ్ డే' చిత్రానికి ఇది రీమేక్. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X