»   » సన్నీ పింక్ లిప్స్ : ఇక శృంగార ప్రియులకు పండగే!

సన్నీ పింక్ లిప్స్ : ఇక శృంగార ప్రియులకు పండగే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: గతంలో బాలీవుడ్లో వచ్చిన 'హేట్ స్టోరీ' చిత్రం హిట్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'హేట్ స్టోరీ 2' చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. సెక్స్ అండ్ క్రైం కథాంశాలతో కూడిన కథాంశాలకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. హేట్ స్టోరీ 2 చిత్రం కూడా అదే కోవకు చెందినదే కావడం గమనార్హం. టీవీ యాక్టర్ జయ్ భానుశాలి, పంజాబీ నటి సర్వీన్ చావ్లా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు శృంగార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో 'హేట్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన విక్రమ్ భట్ 'హేట్ స్టోరీ 2' ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్ భట్ అసిస్టెంట్ విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.

ట్రైలర్ టెమ్టింగ్‌గా ఉండటంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? రసిక ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వారికి తాజాగా మరో శుభవార్త కూడా అందుతోంది. ఈచిత్రంలో శృంగార తార సన్నీ లియోన్ ఐటం సాంగులో అందాలు ఆరబోస్తోంది. 'పింక్ లిప్స్' అంటూ సాగే ఈ సాంగ్ టీజర్ విడుదలై ఆమె అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇప్పటికే హీరో హీరోయిన్ల మధ్య హాట్ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయి...వారి జోరుకు సన్ని లియోన్ కూడా జత అయింది కాబట్టి సినిమాల్లో శృంగార రసాన్ని బాగా ఆస్వాదించే వారికి....ఈ సినిమా పండగ చేసుకునే విధంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తన జీవితాన్ని, ప్రేమను నాశం చేసిన ఒక వ్యక్తిపై ఓ మహిళ ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈచిత్రం సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ హాట్ బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఈచిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. జులై 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్


‘హేట్ స్టోరీ 2' చిత్రంలో సన్నీ లియోన్ ఐటం సాంగ్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా శృంగార ప్రియులను, యువతను ఈ చిత్రం బాగా ఆకర్షిస్తోంది.

హేట్ స్టోరీ 2

హేట్ స్టోరీ 2


హేట్ స్టోరీ 2లో జయ్ భానుశాలి, సర్వీన్ చావ్లా మధ్య హాట్ హాట్ ముద్దు సీన్లు ఉన్నాయి.

సర్వీన్ చావ్లా

సర్వీన్ చావ్లా


బాలీవుడ్లో తొలి చిత్రం చేస్తున్న సర్వీన్ చావ్లా రెచ్చి పోయి హాట్ సీన్లు, బికినీ సీన్లు, పడక గది సీన్లలో నటించింది.

హిట్ ఫార్ములా...

హిట్ ఫార్ములా...

ప్రస్తుతం యూత్ మెచ్చే అంశాలైన సెక్స్, క్రైం, రొమాన్స్ అంశాలు జోడించడంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంగా ఉన్నారు నిర్మాతలు.

English summary
Watch how Sunny Leone dance in her latest item song in Hate Story 2. The adult star turned Bollywood actress is busy with her television show MTV splitsvilla. Sunny had signed in to do an item number for the film Hate Story 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu