ఆశ్చర్యపరిచే వీడియో.... విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ వెనక అసలు స్టోరీ!
'పెళ్లి చూపులు' మూవీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్రతిష్టాత్మక గీతాఆర్ట్స్ బేనర్లో 'టాక్సీవాలా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే 'అర్జున్ రెడ్డి' తర్వాత నాలుగు ఇంట్రెస్ట్ స్క్రిప్టులు విజయ్ దగ్గరికి వచ్చాయి. అన్నీ బావున్నాయి. అందులో ఏది ముందు చేయాలనే విషయంలో చాలా కన్ ఫ్యూజ్ అయ్యాడు. చివరకు 'టాక్సీవాలా' స్క్రిప్టు ఎలా ఎంచుకున్నాడో వెల్లడిస్తూ ఓ వీడియో పోస్టు చేశాడు విజయ్. వీడియో చాలా ఇట్రెస్టింగ్‌గా ఉంది మీరూ ఓలుక్కేయండి.
వినూత్నంగా ఉంది...
‘టాక్సీవాలా' ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ వీడియో క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సినిమాను ఇలా కూడా ప్రమోట్ చేయవచ్చా? అని మీరూ ఆశ్చర్యపోవడం ఖాయం.

విజయ్ దేవరకొండ స్టైలే వేరు...
విజయ్ దేవరకొండ సినిమాలు మాత్రమే కాదు... ఆయన సినిమా ఫంక్షన్లు, మీడియా సమావేశాల్లో విజయ్ అప్రోచ్ కూడా చాలా డిఫరెంటుగా ఉంటోంది. తనదైన మ్యానరిజం, పక్కా హైదరాబాద్ యాసతో ఆకట్టుకుంటున్నాడు విజయ్. ఇటీవల టీజర్ రిలీజ్ వేడుకలో విజయ్ మాట్లాడుతూ.... ఒక స్క్రిప్టు గురించి ఎగ్జైటెడ్‍గా ఉన్న ఒక బంచ్ ఆఫ్ యంగ్‌స్టర్స్‌ను మీ స్టైల్ లో మీరు తీయండ్రా అని వదిలేస్తే సెట్ మీద మెంటల్ మెంటల్ అయితే ఇలాంటి సినిమా వస్తుంది. మా చిల్ టీమ్‌కు చిల్లెస్ట్ బాస్ట్ అరవింద్ గారు మీకు నచ్చినట్లు తీయండి అని ఫుల్ పర్మిషన్ ఇచ్చారంటూ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు.

సైన్స్ ఫిక్షన్ మూవీ
టాక్సీవాలాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, సైన్స్ ఫిక్షన్స్, థ్రిల్లర్, కామెడీ చాలా ఉన్నాయి. నా కెరీర్లో చేస్తున్న మూడో డిఫరెంట్ మూవీ. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, ఈ మూవీపై పూర్తి నమ్మకంతో ఉన్నాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

టాక్సీవాలా
విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ 2 , యువి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘టాక్సీవాలా'. ఎస్‌కెఎన్ నిర్మాత. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా తెరెగేట్రం చేస్తున్నారు. మే 18న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

టాక్సీ వాలా టీజర్
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు.
సాంకేతిక వర్గం
పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచర్ల
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
సౌండ్ - సింక్ సినిమా
స్టంట్స్ - జాషువా
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
లిరిక్స్ - కృష్ణ కాంత్
మ్యూజిక్ - జేక్స్ బిజాయ్
ఎడిటర్, కలరిస్ట్ - శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రాఫర్ - సుజిత్ సారంగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - సాయి కుమార్ రెడ్డి
నిర్మాత - ఎస్ కె ఎన్
ప్రొడక్షన్ హౌజ్ - జీఏ 2 మరియు యువి పిక్చర్స్
స్టోరీ, డైరెక్షన్ - రాహుల్ సంక్రిత్యాన్


Click it and Unblock the Notifications











