మరో రొమాంటిక్ సాంగ్ విడుదలైంది (వీడియో)
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరో కజిన్ బార్బీ హోండా బాలీవుడ్ తెరంగ్రేటం చేస్తున్న చిత్రం ‘జిద్'. పేరు సెక్సీగా ఉండాలని ‘మనారా' గా మార్చుకుంది. తొలి చిత్రంలోనే మనారా హాట్ అండ్ సెక్సీ సీన్లలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల విడుదలైన ఆ చిత్రం ట్రైలరే ఇందుకు నిదర్శనం.
ప్రియాంక, పరిణితి చోప్రా వారసత్వం పునికి పుచ్చుకుని ఎంటరైన మనారా తొలి సినిమాలోనే నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న పోటీని తట్టుకోవడానికి గ్లామర్ విషయంలో హద్దులు దాటింది. ఇందులో మనారాకు జోడీగా కరణ్ వీర్ శర్మ నటిస్తున్నారు. శ్రద్ధా దాస్ కూడా మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.

తాజాజా ఈ చిత్రానికి సంబంధించి మరో రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. ‘తూ జరూరి' అంటే సాగే ఈ పాటను బాలీవుడ్ సింగర్ సునిధి చౌహాన్, షరిబ్ సాబ్రి పాడారు. షకీల్ అజ్మి లిరిక్స్ అందించారు. షరిబ్-టోషి సంగీతం అందించారు. ఈ మెలొడీ సాంగ్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఒక ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్. బెనారస్ మీడియా పతాకంపై పతాకంపై అనుభవ్ సిన్హా నిర్మిస్తున్నారు. వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











