లండన్ మ్యూజియంలో రజనీ విగ్రహం?

By Staff


లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వాక్స్ స్టాచ్యూను ఏర్పాటు చేయనున్నారు. రజనీకాంత్ అభిమానుల నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికి 12000 పిటిషన్లు తమకు అందాయని వారు అన్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్ ఇందుకోసం పెద్దయెత్తున ప్రచారాన్ని మొదలుపెట్టి అందులో విజయం సాధించారు.

ఇందుకోసం వారు www.petitiononline.com కు తమ పిటిషన్లను పోస్ట్ చేశారు. శివాజీ సినిమా చేసిన బిజినెస్ వివరాలు తెలుపుతూ విగ్రహ ఏర్పాటుకు రజనీకాంత్ కచ్చితంగా అర్హుడనే విషయాన్ని వారు ఈ పిటిషన్ లో వివరించారు. రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిఉన్న విషయాన్ని వారు ఇందులో తెలియజేశారు. ఈ పిటిషన్ లో 11453 మంది సంతకాలు చేశారు.

పిటిషన్ లో అభిమానులు వాదించిన తీరు...భారతదేశంలో అత్యధఇకంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు..భారత్ లో పెద్ద నటుడు.. దక్షిణ భారతంలోని 00 మిలియన్ల జనాభా ఆరాధ్యుడు..రజనీ చ్తిరాలు ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ చేస్తాయి..శివాజీ సినిమా బ్రిటన్ లో టాప్ 10లో నిలిచింది..అమెరికాలోనూ తన సత్తాను చూపింది...మలేసియా, సింగపూర్, మిడిల్ ఈస్ట్, హాంగ్ కాంగ్, దక్షిణాఫ్రికా, జపాన్, చైనాలలో రజనీ అభిమానులు ఉన్నారు. రజనీని విపరీతంగా అభిమానించే శ్రీలంక తమిళులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. బ్రిటన్ లో 150,000, ఫ్రాన్స్ లో 60,000 మంది ఉన్నారు..జపాన్లో రజనీ హవా అంతా ఇంతా కాదు..ప్రధాని మన్మోహన్ సింగే స్వయంగా జపాన్ పార్లమెంట్ లో రజనీకాంత్ ప్రభావం గూర్చి చెప్పాడు.

ఈ కారణాలు సబబుగానే అనిపించాయి కాబట్టే రజనీ నిగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు తెలిపారు.విశేషమేమంటే రజనీకాంత్ వ్యవహారం సక్సెస్ కావడంతో కమల్ హాసన్ అభిమానులు కూడా మేడమ్ టుస్సాడ్స్ కు పిటిషన్ పంపారు. ఇప్పటికి 900మంది ఫ్యాన్స్ సంతకాలు చేశారు.

More from Filmibeat

Read more about: rajniknath superstar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X