మహేష్ బాబు మల్టీప్లెక్స్‌లో భారీ ఈవెంట్..? అభిమానులు పోటెత్తడం ఖాయం!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం త్వరలో సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుతీరబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విగ్రహం అంతకంటే ముందే హైదరాబాద్‌లో అభిమానులకు అందుబాటులోకి రాబోతోందట.

మహేష్ బాబు, ఏషియస్ సంస్థతో కలిసి ఇటీవల హైదరాబాద్‌లో 'ఎఎంబి సినిమాస్' పేరుతో వరల్డ్ క్లాస్ మల్టీప్లెక్స్ థియేటర్ నెలకొల్పారు. ఈ మల్టీ ప్లెక్స్‌లో అభిమానుల సందర్శనార్థం కొన్ని రోజులపాటు మైనపు విగ్రహాన్ని ఉంచబోతున్నారట.

విగ్రహం సిద్ధమైంది

విగ్రహం సిద్ధమైంది

గతేడాది ఏప్రిల్‌ మాసంలోనే మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు మహేష్ బాబును కలిసి మెజర్మెంట్స్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మైనపు విగ్రహం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సింగపూర్ మ్యూజియంలో దాన్ని ప్రతిష్టించడానికి ముందు హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట.

మహేష్ బాబుతో ఆవిష్కరణ

మహేష్ బాబుతో ఆవిష్కరణ

ఈ విగ్రహాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ‘ఎఎంబి సినిమాస్'లో ఆవిష్కరించిన అనంతరం అభిమానుల సందర్శనార్థం ఉంచి... ఆపై దాన్ని సింగపూర్ మ్యూజికంకు తరలిస్తారని తెలుస్తోంది. అయితే అది ఎప్పుడు? అనేది ఇంకా డేట్ ఫైనల్ కాలేదు.

మైనపు విగ్రహం స్నీక్ పీక్ వైరల్

మైనపు విగ్రహం స్నీక్ పీక్ వైరల్

ఇవాన్ రీస్‌ అనే శిల్పి మహేష్ బాబు వాక్స్ స్టాచ్యూను రూపొందిస్తున్నారు. గతేది జులైలో విగ్రహం తయారీకి సంబంధించిన స్నీక్ పీక్ ఫోటోలు విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విగ్రహం సిద్ధమైతే సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు సూపర్ స్టార్ అభిమానుల తాడికి పెరుగుతుందని భావిస్తున్నారు.

‘ఎఎంబి సినిమాస్'కు అభిమానుల తాకిడి

‘ఎఎంబి సినిమాస్'కు అభిమానుల తాకిడి

‘ఎఎంబి సినిమాస్'లో విగ్రహం ఎప్పుడు సందర్శనకు పెడతారు అనే విషయం త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.

మహేష్ బాబు ‘మహర్షి’

మహేష్ బాబు ‘మహర్షి’

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' చిత్రం చేస్తున్నారు. మహేష్ కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ ఇది. ఆయన గత చిత్రం ‘భరత్ అనే నేను' రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసిన నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X