వేలం వేయనున్నమర్యాద రామన్న సైకిల్
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో రూపొందిన మర్యాదరామన్న చిత్రంలో కీలకమైన పాత్ర పోషించిన సైకిల్ గుర్తుండే ఉంటుంది. రవితేజ చేత డబ్బింగ్ చెప్పించుకున్న ఈ సైకిల్ ఇప్పుడు వేలానికి సిద్దం కాబోతోంది. ఆగస్టు 14వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ ఆవరణలో సాయింత్రం నాలుగు గంటలకు ఈ ఆక్షన్ జరుగుతుందని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఇక ఈ సైకిల్ రేటు ఎంత పలికితే అంతకు మూడు రెట్లు, నేను నిర్మాతలు వేసి దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ కి డొనేట్ చేస్తామని చెప్పారు. మంచి కార్యక్రమానికి వినియోగించే మొత్తం కాబట్టి అంతా పాల్గొని విజయవంతం చేస్తే బావుంటుంది.


Click it and Unblock the Notifications











