'దిల్' కాంబినేషన్ తో వస్తున్నాం.. నితిన్!
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ప్రస్త్తుం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్నారు. నందితశ్వేత ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రఖ్యాత నటుడు ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. భారీ తారాగణంతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దిల్ కాంబినేషన్ రాబోతోంది అంటూ నితిన్ తాజగా ట్వీట్ చేశాడు.ప్రకాష్ రాజ్, దిల్ రాజుతో శ్రీనివాస కళ్యాణం సెట్స్ నుంచి ఫోటో షేర్ చేశాడు. 15 ఏళ్ళక్రితం వచ్చిన దిల్ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఆ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్. మళ్ళీ ఇప్పుడు ఆ కాంబినేషన్ రిపీట్ అవుతోందని నితిన్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











