For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రతీ శుక్రవారం హుస్సేన్ సాగర్లో 15 కోట్లు పోస్తున్నాం.. టాలీవుడ్ పరిస్థితిపై నిర్మాత ఆవేదన

  By Rajababu
  |

  భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ప్రధాన పాత్ర దారులుగా వి ఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కుటుంబ కథా చిత్రం' ఈ చిత్రానికి నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను హీరో నందు, కమల్ కమరాజు, కత్తి మహేష్ విడుదల చేయగా టీజర్ ను నిర్మాత మల్కాపురం శివ కుమార్ గురువారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు.. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ టీజర్, మోషన్ పోస్టర్లు ఏవిధంగా అలరించాయో అదేవిధంగా ట్రైలర్ మరియు సినిమా కూడా ఉంటాయని అన్నారు.

  'కుటుంబ కథా చిత్రం' ట్రైలర్
   బడ్జెట్‌లోనే పూర్తి

  బడ్జెట్‌లోనే పూర్తి

  డైరెక్టర్ వాసు కథ చెప్పినప్పుడే ఈ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాను.. అనుకున్న బడ్జెట్‌లొనే సినిమాను పూర్తి చేసాము. సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్‌కు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.
  ఈ చిత్ర కాన్సెప్ట్ నిజంగా కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది అని నిర్మాత భాస్కర్ అన్నారు.

  నిర్మాతకు రుణపడి ఉన్నా

  నిర్మాతకు రుణపడి ఉన్నా

  దర్శకుడు వాసు మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరికి మనం రుణపడి ఉంటాము నేను కూడా నా జీవితంలో నిర్మాత భాస్కర్‌కు ఋణపడి ఉంటాను. 1980 లో కుటుంబం అంటే అందరూ కలసి ఉండేవారు కానీ 2017 లో కుటుంబం అంటే ముగ్గురు లేక నలుగురు మాత్రమే ఉంటున్నారు.. ఈ చిత్రం కూడా 2017 సంవత్సరంలోని పరిస్థితులకు తగ్గట్టు కాన్సెప్ట్ ఉంటుంది అన్నారు.

   రాబందులా సెక్యూరిటీ

  రాబందులా సెక్యూరిటీ

  ప్రేమతో గొడవపడే ఓ ఫ్యామిలీలోకి ఆ ఇంటి సెక్యూరిటీ సిబ్బంది రాబందువులా మారితే ఆ పరిణామం ఎలా ఉంటుందో తెలిపేదే ఈ మా కుటుంబ కథాచిత్రం.. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఏ చిత్రానికైనా కావాల్సింది ఆర్ఆర్.. అదే ఈ చిత్రంలో ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుందని కత్తి మహేష్ అన్నారు

   నిర్మాత గట్స్‌కు అభినందన

  నిర్మాత గట్స్‌కు అభినందన

  మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ, "తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి శుక్రవారం దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయలు హుసేన్ సాగర్లో పోసినట్టు ఉంటోంది.. ప్రమోషన్స్ కు ఒక కోటి రూపాయలు ఖర్చుపెడుతా అని చెప్పిన నిర్మాత భాస్కర్ గట్స్‌ను అభినందించాల్సిన అవసరం ఉంది.. ప్రతి ప్రేక్షకునికి రీచ్ అయ్యే టైటిల్ పెట్టడంలొనే సగం సక్సెస్ అయ్యారని అనుకుంటున్నా... టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నా టీజర్ మాత్రం పెద్ద సినిమా డైరెక్షన్ లా కనిపిస్తుంది అందుకే ఈ టీజర్ చూసినప్పుడే నిర్ణయించుకున్నా చిత్రానికి అండగా ఉండాలని, ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్" అని చెప్పారు.

   ఇది డిఫరెంట్ కాన్సెప్ట్

  ఇది డిఫరెంట్ కాన్సెప్ట్

  డిఫరెంట్ కాన్సెప్ట్, ఫ్రెష్ స్క్రీన్ ప్లే ఉండడం తోనే ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించాను, కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది ఈ సినిమా అని హీరో నందు తెలిపారు, అనంతరం కమల్ కామరాజు మాట్లాడుతూ, "ఇంతకుముందు నేను చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో చేసిన రోల్‌కు మంచి పేరొస్తుందని భావిస్తున్నా... డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండడం వలనే ఈ సినిమా చేయడానికి అంగీకరించడం జరిగింది, ఇందులో నా పాత్ర నెగటివ్ షేడో పోసిటివ్ షెడో సినిమా ఎండింగ్ లో తెలుస్తుంది.. ఒక కట్ కూడా లేకుండా నటించడం జరిగింది గ్రేట్ స్క్రిప్ట్ ఉండడమే దీనికి కారణం ఈ స్టోరీ ని ఏ భాషలో చేసినా ఆడే దమ్ముందని ఘంటాపదంగా చెప్పగలను" అని చెప్పారు. "డిఫరెంట్ కాన్సెప్ట్.. కొత్త స్క్రీన్ ప్లే ఉండటంతోనే ఈ సినిమా కు పని చేయడానికి అంగీకరించాను " అని డీఓపీ జోషి అన్నారు.

   నటీనటులు, టెక్నికల్

  నటీనటులు, టెక్నికల్

  నందు, శ్రీముఖి, కమల్ కామరాజు, సూర్య నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, డీఓపీ: మల్హర్ భట్ జోషి, నిర్మాత: దాసరి భాస్కర్ యాదవ్, డైరెక్టర్: వి. ఎస్ వాసు, పిఆర్వో: వంశి శేఖర్.

  English summary
  Producer Bhaskar's latest movie Kutumba Katha Chitram. Anchor Sreemukhi, Nandu are lead pair. Vasu is the director. This Audio release function organised in Hyderabad recently. In this event, Producer Malkapuram Shivakumar gets emotional and said that every friday nearly 15 crores are dumping in Hussain sagar for new releases.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X