అన్నా హజారే తమ సినిమా చూసి ప్రశంశించారంటూ శ్రియ రెండు రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది మీడియాలో బాగా ప్రచారం కావటంతో శ్రియ కావాలని అన్నా హజారే ఇమేజ్ ని ఉపయోగించుకుంటోందని,తన గలీ గలీ మే చోర్ హైసినిమా పబ్లిసిటీకి వాడుకుంటోందంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇది విన్న శ్రియ కోపంతో మండిపడుతోంది. తానేమీ ఆయన్ని వాడుకోవటం లేదని,కేవలం తాను ఆయన తన సినిమా చూసారని అన్నానని క్లారిఫై చేసింది. అవినీతి పై తీసిన సినిమా కావటంతో ఆయన ఉండే గ్రామానికి వెళ్లి చూపించాము అంతేనని ..అంతకు మించి వేరే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ఇక ఈ చిత్రం ఓ పొలిటకల్ సెటైర్. భరత్ అనే కామన్ మ్యాన్ చుట్టూ తిరిగే కథ అది. ఆ కామన్ మ్యాన్ గా అక్షయ్ ఖన్నా చేసారు. ఆయన భార్యగా శ్రియ చేసింది. కామిడీతో నడిచే ఈ చిత్రం ఎంతలా భూఫాల్ లోని ఓ చిన్న టౌన్ నేపధ్యంలో కథ జరుగుతుంది. అక్కడ అవినీతి ఏ రేంజిలో పాతుకుపోయిందో చూపుతుంది.