మాది ఒక అందమైన జంట: హన్సిక

By Sindhu

రామ్‌ తో ఇది నా రెండో సినిమా. అంతకు ముందు 'మస్కా"లో కలిసి నటించాం. మాది అందమైన జంట అని ఆ సినిమాతో ఆనాడే రుజువైంది. ఇక ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారకుడు కూడా తనే. కథల విషయంలో రామ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. తనమీద నమ్మకంతోనే ఈ సినిమాకు అంగీకరించాను. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండటం మా పాత్రలకు కూడా మంచి హెల్ప్ అయ్యింది అంది హాట్ స్టార్ హన్సిక.

అలాగే తెలుగులో గ్యాప్ రావటానకి కారణం వివరిస్తూ.. తమిళ సినిమాలతో బిజీగా ఉండటమే కారణం. ఈ ఏడాదిలో నాలుగు తమిళ సినిమాల్లో నటించాను.దాంతో తెలుగు సినిమాపై కాన్సన్‌ ట్రేట్ చేయలేకపోయాను. 'కందిరీగ" చేయడంతో మళ్లీ పుట్టింటికి వచ్చినట్టుంది అంది.తన తాజా చిత్రం 'కందిరీగ"గురించి చెపుతూ..ఓ హీరో, ఆ హీరోతో చిందులేయడానికి ఓ హీరోయిన్… ఇలా ఉండదు 'కందిరీగ"లో నా పాత్ర. ఎంత అందంగా కనిపిస్తానో… అంతటి అభినయాన్ని కూడా పండిస్తాను. అసలు ఓ మంచి సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ 'కందిరీగ"లో ఉంటాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా పండగలా ఉంటుంది. డెరైక్టర్ సంతోష్ శ్రీనివాస్ అంత గొప్పగా తీశారు అంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X