శృతి హాసన్ ఆ హీరో మత్తులో పూర్తిగా మునిగిపోయినట్లేనా?
కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ పూర్తిగా సిద్దార్ధ ప్రేమ మత్తులో ములిగిపోయిందంటున్నారు.రీసెంట్ గా వీరిద్దరూ రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ దర్శకత్వంలో అనగనగా ఒక ధీరుడు చిత్రంలో నటించారు. అప్పటినుంచి వీరి మధ్య పరిచయం చనువుగా మారి ఆ తర్వాత ప్రేమగా మారిందంటున్నారు. వీరిద్దరూ కలిసి సాయింత్రం ఎక్కడో చోట సిటిలో ఒంటరిగా కనపడటం, పార్టీలలో కూడా ఇద్దరూ కాస్సేపటికి మాయమవటం ఈ టాక్ రావటానికి కారణం అంటున్నారు.అయితే శృతి మాత్రం మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే. ఇద్దరం కలిసి సినిమా చేసాం. ప్రాజెక్టు అయిపోయిన వెంటనే సంభందం లేనట్లు పలకరింపులు కూడా చేసుకోకూడదంటే ఎలా అని ప్రశ్నిస్తోంది.ఇక వీరిద్దరూ కలిసి చేసిన అనగనగా ఒక ధీరుడు చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోంది.
శృతి హాసన్ సిద్దార్ధ రాఘవేంద్రరావు అనగనగా ఒక ధీరుడు కమల్ హాసన్ shruti hassan siddharth raghavendra rao anaganaga oka dheerudu kamal hassan


Click it and Unblock the Notifications