మా మీద ఫత్వాలున్నాయ్: ప్రవక్త మీద సినిమా విషయం గుర్తు చేసుకున్న రెహమాన్

ఇరానియన్ ఫిలిం మేకర్ మాజిద్ మాజిది పై.. తనపై పలు మార్లు ఫత్వాలు జారీ అయ్యాయని.. తాము చాలా ప్రత్యేకమైన వ్యక్తులం అని ఏఆర్ రెహమాన్ చెప్పడం విశేషం.

Recommended Video

AR Rahman On Working With Majid Majid రెహమాన్ పై ఫత్వా జారీ

తమకు వ్యతిరేకంగా ఫత్వా జారీ కావడాన్ని చాలమంది మహమ్మదీయులు అవమానంగా భావిస్తారు. కానీ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మాత్రం.. ఈ అంశాన్ని డిఫరెంట్ గా ప్రస్తావించాడు. ఇరానియన్ ఫిలిం మేకర్ మాజిద్ మాజిది పై.. తనపై పలు మార్లు ఫత్వాలు జారీ అయ్యాయని.. తాము చాలా ప్రత్యేకమైన వ్యక్తులం అని చెప్పడం విశేషం.

 మొహమ్మద్: ది మెసెంజర్ ఆఫ్ గాడ్

మొహమ్మద్: ది మెసెంజర్ ఆఫ్ గాడ్

గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరుగుతోంది. తొలి రోజున ఈ కార్యక్రమానికి ఏఆర్ రెహమాన్ తో పాటు.. మాజిద్ మాజిది కూడా అటెండ్ అయ్యారు. 2015లో వచ్చిన మొహమ్మద్: ది మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి గాను తమపై ఫత్వాలు జారీ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు ఏఆర్ రెహమాన్.

మహమ్మద్ ప్రవక్త

మహమ్మద్ ప్రవక్త

మహమ్మద్ ప్రవక్తపైసినిమా తీసినందుకు ఆ చిత్ర దర్శకుడు మాజిద్ కు, సంగీతం సమకూర్చినందుకు ఏఆర్ రెహ్మాన్ కు ఫత్వాలు జారీ చేశారు. ముంబయికి చెందిన రజా అకాడెమీ ఈ ఫత్వాను జారీ చేసింది. ఇస్లాం ప్రకారం మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించి ఎలాంటి బొమ్మలు, సినిమాలు తీయటం నిషేధం.

 ప్రవక్తపై సినిమా తీశారు

ప్రవక్తపై సినిమా తీశారు

మాజిద్ ఇరాన్ ప్రభుత్వ సాయంతో ప్రవక్తపై సినిమా తీశారు. దానికి రెహమాన్ సంగీతం అందించారు. అందుకే ఇప్పుడు ఆ విషయంలో ఇద్దరూ ఒకటే అన్నట్టు పోల్చిన రెహమాన్ బియాండ్ ద క్లౌడ్స్ అంటూ తమ తర్వాతి ప్రాజెక్టు ఉంటుందని చెప్పుకొచ్చారు.

మాజిద్ మాజిది

మాజిద్ మాజిది

'అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన మాజిద్ మాజిది వంటి తో కలిసి వర్క్ చేయడం ఎంతో సంతోషం కలిగించే విషయం. ఆయన ఎంతో ధైర్యం ఉన్న వ్యక్తి. మా ఇద్దరి మీదా ఫత్వాలు జారీ అయ్యాయి. మేము ఎలైట్ సొసైటీకి చెందిన వ్యక్తులం' అంటూ నవ్వేశారు రెహమాన్.

మాళవికా మోహనన్

మాళవికా మోహనన్

ఇషాన్ ఖట్టర్.. మాళవికా మోహనన్ కలిసి నటించిన బియాండ్ ద క్లౌడ్స్ చిత్రం కోసం ప్రస్తుతం వీరు కలిసి పని చేస్తున్నారు. అన్నా-చెల్లెళ్ల రిలేషన్ షిప్ ఈ చిత్రానికి మూలకథగా ఉంటుంది. ముఖ్య పాత్రలో సీనియర్‌ తమిళ నటి జీవీ.శారద నటిస్తున్నారు.

 మూడు భాషల్లో

మూడు భాషల్లో

ఈమె చాలా కాలం తరువాత తమిళంలో కనిపించనున్న చిత్రం ఇదే అవుతుంది. బియాండ్‌ ది క్లౌడ్స్‌ చిత్రాన్ని మూడు భాషల్లో ఆయా సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని చేర్పులు మార్పులు చేసి రూపొందిస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X