అది లేకుండా ప్రేమా..? హ్హిహ్హిహ్హి: ప్రియాంక చోప్రా
నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అంటే...షరతులు లేకుండా ప్రేమించడం, ప్రేమించిన వారి కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావడం అంటుంటారు చాలా మంది. అయితే ఈ వాదనతో అస్సలు ఏకీభవించడం లేదు బాలీవుడ్ హాట్ బేబీ ప్రియాంక చోప్రా. 'ఎలాంటి షరతులు లేకుండా ప్రేమించుకోవడమన్నది ఈ రోజుల్లో సాధ్యం కాదు. అన్‌కండీషనల్ లవ్ వుంటుందనేది భ్రమే" అంటూ హ్హిహ్హిహ్హి అంటూ వ్యంగ్యంగా నవ్వుతోంది.
ఏన్నో ఏళ్లుగా అన్‌కండీషనల్ లవ్ అనే పదాన్ని వింటున్నాను కానీ తన అనుభవంలోకి ఎప్పుడూ రాలేదని సెటైర్లు వేస్తోది. స్టార్‌ప్లస్ ఛానెల్ నిర్వహిస్తున్న ఓ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ప్రియా ప్రేమ గురించి మీ అభివూపాయమేమిటని అడిగినప్పుడు పై విధంగా స్పందించింది. ప్రేమలో ఎవరి వ్యక్తిత్వం దెబ్బతినకూడదని, అలాంటప్పుడే ఆ ప్రేమ విజయవంతమవుతుందని చెప్పింది.
మిమ్మల్ని ఏవరైనా ప్రేమలో పడేయాలంటే ఏం చేయాలని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు ...తన మాజీ లవ్వర్స్ పేర్లు గానీ, ఇప్పడు ఎఫైర్ నడపుతున్న హీరోల పేర్లు కానీ చెప్కుండా టాపిక్ డైవర్ట్ చేసిన ప్రియాంక...'నాకంటూ స్వంత వ్యక్తిత్వం వుంది. నా హృదయంలో చోటు సంపాదించడమంటే అంత ఈజీ కాదు. నా వ్యక్తిత్వాన్ని అన్ని విధాలుగా సంతృప్తిపరచాలి...నేను ఊహించని విధంగా నన్ను సర్‌ఫ్రైజ్ చెయ్యాలి...ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తను నా కోసమే వుంటాననే భరోసా కలిగించాలి" అలాంటి వ్యక్తికే నా మనసులో, నా జీవితంలో చోటు దక్కుతుంది అంటోంది.


Click it and Unblock the Notifications











