నాగ చైతన్యతో ‘ఢిల్లీ బెల్లీ’ రీమేక్ లేదు: యుటివి
నాగచైతన్య తాజాగా 'ఢిల్లీ బెల్లి' హిందీ రీమేక్ కి కమిటయ్యారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా వచ్చి వదంతులే అని తేలి పోయింది. నాగ చైతన్య ను ఎటువంటి రిమేక్ కోసం సంప్రదించలేదు అని “యుటివి" సంస్థ చెప్పింది. యుటివి సంస్థ అధినేత ధనంజయ గోవింద్ ఈ వార్తపై మాట్లాడుతూ 'మేము డిల్లీ బెల్లీ చిత్రాన్ని రిమేక్ చేయాలనుకున్న విషయం వాస్తవమే కానీ... ఇంత వరకు ఏ ఒక్క నటుడుని కూడా సంప్రదించలేదు. డిల్లీ బెల్లీ చిత్రం కోసం ప్రముఖ నటులను సంప్రదించం అని వచ్చే పుకారులని నమ్మకండి' అని చెప్పారు.
ప్రస్తుతం నాగ చైతన్య దేవా కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాధా మోహన్ దర్శకత్వంలో 'గౌరవం' అనే చిత్రంలో నటించనున్నారు. గౌరవం చిత్రంలో నాగార్జన తొలి సారిగా నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











