పవన్ కళ్యాణ్‌పై అటాక్ చేయడం లేదు: రాజశేఖర్
హైదరాబాద్: గబ్బర్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడు రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజశేఖర్ తాజా సినిమా 'మహంకాళి'లో పవర్ స్టార్‌పై సెటైర్లు ఉండబోతున్నాయి అనే రూమర్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో రాజశేఖర్ స్పందించారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో ఆయన మాట్లాడుతూ 'సినిమా కంటెంట్ గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్‌పై తన సినిమాలో వ్యక్తిగత దాడి చేయదలుచుకోలేదు. అయితే సెటైర్ అనేది మా సినిమాకు కీలకం కానుంది.' అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
రాజశేఖర్ వ్యాఖ్యలను బట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పై గానీ, ఇతరులపై గానీ ప్రత్యక్ష విమర్శలు లేకుండా.... పరోక్షంగా సున్నితమైన సెటైర్లు ఉంటాయని స్పష్టం అవుతోంది. సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఈ సినిమాలో చూపెట్టబోతున్నట్లు రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
మహంకాళి సినిమా రేపు (మార్చి 8) విడుదల కాబోతోంది. రాజశేఖర్ సరసన మధురిమ హీరోయిన్. ఈచిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు సురేందర్ రెడ్డి, పరంధామరెడ్డి. సినిమా ప్రారంభమైన తొలినాళ్లలో ఈ చిత్రానికి కార్తికేయను దర్శకుడిగా నియమించారు. అయితే కొంత కాలం తర్వాత ఈ సినిమా నుంచి కార్తికేయ తప్పుకోవడంతో రాజశేఖర్ భార్య జీవిత ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.


Click it and Unblock the Notifications











