దీపిక క్లీవేజ్ షో వివాదం: షారుక్ ఖాన్ మద్దతు!
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ గురించి ఓ ఆంగ్లపత్రికలో... " OMG: Deepika Padukone's cleavage show" అంటూ వచ్చిన కథనంపై దీపిక ఘాటుగా రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో షారుక్ ఖాన్ కూడా చేరారు.
సదరు పత్రిక కథనంపై దీపిక మండి పడుతూ....‘అవును, నేను మహిళను. నాకు వక్షోజాలుంటాయి, దాని వల్ల మీకేంటి సమస్య' అంటూ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చింది. దీపిక వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన మద్దతు ప్రకటించారు. ఆమెను ప్రశంసించారు. ఆమె ఎంతో ధైర్యవంతురాలని, ఆమెలా తన మనసులోని అభిప్రాయాలు బయటకు చెప్పడం అందరికీ సాధ్యం కాదని, తనతో పాటు ‘హ్యాపీ న్యూ ఇయర్' మూవీ టీం మద్దతు ఆమెకు ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు దీపికకు మద్దతుగా నిలవాలని కోరారు. హ్యాపీ న్యూ ఇయర్ ఆడియో రిలీజ్ సందర్భంగా షారుక్ ఈ వ్యాఖ్యలు చేసారు.

‘అవును, నేను మహిళను. నాకు వక్షోజాలుంటాయి, దాని వల్ల మీకేంటి సమస్య' అంటూ దీపిక కౌంటర్ ఇచ్చింది. ‘మహిళలకు గౌరవం ఇవ్వడం తెలియనపుడు...మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదు' అంటూ సదరు పత్రిక కథనంపై నిప్పులు కక్కింది. దీపిక పదుకోన్‌కు పలువురు బాలీవుడ్ స్టార్లతో పాటు వేలాది మంది అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె ట్వీట్‌ను సపోర్టు చేస్తూ, వేలాది రీట్వీట్ చేసారు.
దీపిక వెల్ డన్... అంటూ ప్రియాక చోప్రా మద్దతు ఇస్తే, హుమా ఖురేషి, అదితి రావు హైదరి, దియా మీర్జా, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రాహుల్ బోస్, సూజిత్ సర్కార్, వీర్ దాస్, సంజయ్ గుప్తా, సాఖిబ్ సలీమ్, విశాల్ దల్దాని లాంటి వారు తమ మద్దతు ప్రకటించారు. సదరు ఆంగ్లపత్రిక కథనాన్నితప్పుబట్టారు.


Click it and Unblock the Notifications