శృతి హాసన్ వార్తపై మండిపడ్డ రాజమౌళి
హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి 'బహుబలి' సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా రాణా విలన్ గా నటిస్తున్న ఈచిత్రం శృతి హాసన్ కూడా ఎంపికయిందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శృతి హాసన్ ను తమ సినిమాలో తీసుకున్నట్లు వచ్చిన వార్తలను రాజమౌళి ఖండించారు.
ఈ విషయమై ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ.... 'బహుబలి చిత్రంలో శృతి హాసన్ ఎంపిక చేయలేదు. ఆమెను ఏ పాత్ర కోసమూ సంప్రదించలేదు. ఇది పూర్తిగా అవాస్తవమైన వార్త' అని రాజమౌళి మండిపడ్డారు. బహుబలి సినిమా గురించిన ఇతర వివరాల్లోకి వెళితే, మగధీర తర్వాత ఆ రేంజిలో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా ఇది.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది.
ఈ సినిమాను రాఘవేంద్రరావు సమర్పణలో శోబు ఆర్కా మీడియా బేనర్ పై భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు.


Click it and Unblock the Notifications











