సమంత విషయంలో వివరణ ఇచ్చిన డైరక్టర్ రాజమౌళి
తన తాజా చిత్రం "ఈగ" లో సమంతని హీరోయిన్ గా దర్శకుడు రాజమౌళి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తదుపరి ప్రభాస్ చిత్రంలో ఆమెకు అవకాశమిస్తానని చెప్పే ఆమెని ఒప్పించారని, ఆమె రాజమౌళి దర్శకత్వంలో రెండు చిత్రాలు చేయనుందని వార్తలు వచ్చాయి. అయితే రాజమౌళి తాజాగా ఈ విషయాన్ని ఖండిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ లో...ప్రభాస్ సినిమా గురించి చాలా న్యూస్ లు వినపడుతున్నాయి. కానీ నాకు ఇప్పటివరకూ కథ ఏంటనేది తెలియదు. అలాగే విశ్వామిత్ర చిత్రం చేయటం లేదు కూడా. అలాగే బడ్జెట్ కూడా తెలియదు..అలాంటప్పుడు సమంతను హీరోయిన్ గా ఎలా బుక్ చేస్తాం అని ప్రశ్నించారు.
సమంత రాజమౌళి సునీల్ మర్యాద రామన్న ప్రభాస్ నాగార్జున ఈగ samantha rajamouli maryada ramanna sunil saloni magadheera eega


Click it and Unblock the Notifications