»   »  నీ కొడుకును కాల్చివేస్తాం.. దర్శకుడి తల్లికి అబూ సలెం ఫోన్

నీ కొడుకును కాల్చివేస్తాం.. దర్శకుడి తల్లికి అబూ సలెం ఫోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'కుచ్ కుచ్ హోతా హై చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అందరం బిజీగా ఉన్నాం. సమయంలో ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. మా అమ్మ ఫోన్ ఎత్తింది. అవతల వైపు నుంచి గంభీరంగా ఓ వ్యక్తి మాట్లాడుతూ నీ కొడుకు ఎర్ర రంగు టీషర్ట్ వేసుకొన్నాడు. మాకు అతడు కనిపిస్తున్నాడు. అతడ్ని కాల్చివేస్తాం అని గ్యాంగ్ స్టర్ అబూ సలెం బెదిరించాడు'అని దర్శకుడు కరణ్ జోహర్ తన తాజా జీవిత చరిత్ర 'యాన్ ఏ అన్ సూటబుల్ బాయ్'లో వెల్లడించారు.

we're going to shoot Karan Johar: Abu salem

ఆ సమయంలో తన తల్లి గజగజ వణికిపోయిందని తెలిపారు. ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన తమ కుటుంబం ఆ చిత్రంపైనే ఆశలు పెట్టుకొన్న సమయంలో అబూ సలెం మనుషులు భారీగా డబ్బు ముట్టజెప్పాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. అప్పుడు చిత్రాన్ని వాయిదా వేయాలని అనుకొన్నామని, అయితే షారుక్ ఖాన్ తమకు బాసటగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చారని వెల్లడించారు.

దర్శకుడు కరణ్ జోహర్ కు గ్యాంగ్ స్టర్ అబూ సలెం బెదిరింపులు

English summary
Karan Johar reveals abu salem warning in An Unsuitable Boy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu