బద్రీనాధ్ లో ఆ పార్ట్ ని రీషూట్ చేస్తున్నాం...అల్లు శిరీష్
మేము బద్రీనాధ్ చిత్రంలోని కామిడీ ఎపిసోడ్ ని రీషూట్ చేస్తున్నాము.అయితే అది తమిళ వెర్షన్ కోసం.అక్కడ టాప్ కమిడెయన్ సంతానం ఆ షూటింగ్ లో పాల్గొంటారు.సునీల్ తెలుగులో చేసిన కామిడీ పార్ట్ ని మారుస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు అల్లు శిరీష్. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న బద్రీనాధ్ చిత్రం తెలుగు,తమిళ వెర్షన్ లలో ఒకే సారి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ చిత్రం ఆడియోని ఘనంగా విడుదల చేసారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా కనిపిస్తారు.
గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు...వి వి వినాయిక్ డైరక్ట్ చేస్తున్నారు. గతంలో వి వి వినాయిక్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో బన్నీ చిత్రం విడుదలై మంచి విజయం సాదించింది. డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ చిత్రం గురించి చెబుతూ....ఇది నా పదో సినిమా. నా తొలి చిత్రానికి కథను ఇచ్చింది చిన్నికృష్ణ. స్వరాలు అందించింది కీరవాణి. మళ్లీ పదో చిత్రానికి వారిద్దరూ పని చేయడం సంతోషంగా ఉందన్నారు.


Click it and Unblock the Notifications











