twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యామిలీ ఫంక్షన్‌పై ఇంత రాద్దాంతమా: రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ ఇంటి వద్ద శనివారం రాత్రి జరిగిన పార్టీ విషయంలో పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అర్దరాత్రి తమకు నిద్రబంగం చేస్తున్నారని, డిస్ట్రబెన్స్ చేస్తున్నారంటూ చుట్టుపక్కల వారకు ఫిర్యాదు చేయడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది.

    ఈ ఘటనపై రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా స్పందించారు. ‘మా ఇంట్లో జరిగిన సింపుల్ ఫ్యామిలీ డిన్నర్ లౌడ్ బాష్‌గా చిత్రీకరించడం ఆశ్చర్యకరంగా ఉంది. మా ఇరుగుపొరుగు వాళ్లను నేను గౌరవిస్తాను. వారి ప్రైవసీకి భంగం కలిగించాలనే ఉద్దేశ్యం మాకు ఏ మాత్రం ఉండదు. మాపై వచ్చిన ఆరోపణలన్నీ తొలగిపోతాయని భావిస్తున్నాను' అంటూ రామ్ చరణ్ వివరణ ఇచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇదీ జరిగింది...
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అతని స్నేహితులైన ఎమ్మల్యే తీగల కృష్ణారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరికొందరు కలిసి జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 25 లోని రామ్ చరణ్ తన నివాసంలో శనివారం రాత్రి పార్టీ చేసుకోవడం, భారీగా లౌడ్ స్పీకర్లు పెట్టి గోల చేయడం వల్ల చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

    We respect our neighbor: Ram Charan

    దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అర్ధరాత్రి దాటాక పోలీసులు అక్కడికి రావడం, ఇతరకు డిస్ట్రిబెన్స్ కలిగించొద్దని వార్నింగ్ ఇవ్వడం, వారు వినక పోవడంతో రామ్ చరణ్ అతని స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ ఎలాంటి కేసు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. తామె చెప్పిన వెంటనే వారు చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించకుండా మ్యూజిక్ సౌండ్స్ ఆపేసి లోనికి వెళ్లి పోయారని, అందుకే ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు స్పష్టం చేసారు.

    రామ్ చరణ్, అతని స్నేహితుల కారణంగా చుట్టుపక్కల వారు రాత్రిపూట నిద్రలేక ఇబ్బంది పడ్డారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఆ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100 కి ఫోన్ చేసి పోలీస్ లకు సమాచారం అందించారు. పోలీసులు రావడంతో గొడవ సద్దుమనిగింది.

    గతంలో కూడా రామ్ చరణ్ రోడ్డుపై జరిగిన గొడవ విషయంలో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బాడీగార్డులు ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. రామ్ చరణ్ ఆదేశాల మేరకే వారు అలా రోడ్డుపై రెచ్చిపోయారనే వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

    English summary
    "Wonder how a simple family dinner at my home is being is made out to seem like a loud bash.. We respect our neighbors and most of all their privacy. I'm sure that now all speculations can be put to rest" Ram Charan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X