twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి'ది వాపే..,'దాసి'లో ఆ ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ చాలు..: బి.నర్సింగరావు

    |

    హాలీవుడ్ సినిమా మనకన్నా వందేళ్లు ముందుంది అనేది దర్శకుడు రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ల అభిప్రాయం. ఆయనొక్కడిదే కాదు.. ప్రపంచ సినిమా గురించి తెలిసినవాళ్లెవరైనా ఇదే మాట చెబుతారు.

    'బాహుబలి' సినిమా మనకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చింది అని చాలామంది అభిప్రాయపడవచ్చు. కానీ అది మనల్ని సంతృప్తిపరుచుకోవడమే తప్ప.. దాని కంటెంట్ హాలీవుడ్ స్థాయి ఏమాత్రం కాదన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం. 'మా భూమి' లాంటి ఎవర్ గ్రీన్ హిట్ అందించిన బి.నర్సింగరావు కూడా ఇప్పుడదే అభిప్రాయం వెలిబుచ్చారు.. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

     'బాహుబలి'ది వాపే.., అంత కష్టపడక్కర్లేదు:

    'బాహుబలి'ది వాపే.., అంత కష్టపడక్కర్లేదు:

    'బాహుబలి' చూశాను. అది వాపే కాని... బలుపు కాదు. అందులో రాజమౌళి యుద్ధం, భల్లాలదేవకు సంబంధించిన క్రోదం చూపిస్తాడు. దానికి అతను ఎంతో సమయం తీసుకొని ఉండొచ్చు. ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ నా 'దాసి' సినిమాలో ఆ క్రోదాన్ని ఒక్క ఎక్స్‌ప్రెషన్‌లో చూపించాను. అంత కష్టపడక్కర్లేదు.

    Recommended Video

    Baahubali 2 Russian Trailer, Watch
     హాలీవుడ్‌ స్థాయి 'బాహుబలి'కి లేదు..:

    హాలీవుడ్‌ స్థాయి 'బాహుబలి'కి లేదు..:

    టెక్నికల్‌గా మాత్రం రాజమౌళిని అభినందిస్తాను. కానీ అది కూడా హాలీవుడ్‌తో పోల్చేంత స్థాయి కాదు. ఆ తరహాలో చేశాడంతే. ఉదాహరణకు 'బెన్‌హర్‌' సినిమాలో గుర్రపు బగ్గీల సీన్‌కు ఆ రోజుల్లో 110 కెమెరాలు పెట్టారు. హాలీవుడ్‌లో దర్శకుడంటే కేవలం దర్శకత్వ బాధ్యతలే చూస్తాడు. మిగతా డిపార్ట్‌మెంట్స్ బాధ్యతలు వేరేవాళ్లవి. కానీ మన దగ్గర దర్శకుడే అన్నీ చేసేస్తాడు.

     తీసింది అరడజనే.. కానీ!:

    తీసింది అరడజనే.. కానీ!:

    6 సినిమాలకు డైరెక్షన్‌ చేశాను. అందులో ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించాను. 45 సంవత్సరాల్లో నాలుగే సినిమాలు చేశానంటే, వాటిలో నా ప్రాణం పెట్టి తీశాను అందుకే అవి చాలా విలువైనవి. తీసింది అర డజను సినిమాలు మాత్రమే అయినా డైరెక్టర్‌గా, నిర్మాతగా అంతర్జాతీయ స్థాయిలో నాకెంత పేరు వచ్చిందో తెలిసిందే.

     సినీ జర్నీ:

    సినీ జర్నీ:

    సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. నటుడు కావాలనే కోరిక ఉండేది. ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుతున్నప్పుడు ఆర్‌.ఆర్‌ ల్యాబ్స్‌లో ఒక ఫిల్మ్‌క్లబ్‌ ఉండేది. అక్కడ సత్యజిత్‌రే సినిమాలు ప్రదర్శించేవారు.

    నన్ను పిలిస్తే ఓరోజు వెళ్లాను. ఆరోజుల్లో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి అబ్బాయి మాతో చదువుకున్నాడు. తను కూడా అక్కడికొచ్చాడు. అప్పటి వరకు సినిమా అంటే ఆటలు, పాటలు, జానపదం. ఆ సినిమా ప్రభావం చాలా పడింది. సినిమాలను జీవితానికి ఇంత దగ్గరగా, సహజంగా ఉండేలా తీయొచ్చా? అనిపించింది.

     'దాసి' ఆల్ టైమ్ హిట్!, దొరల గడీల్లోనే పెరిగిన మీరు ఆ సినిమా ఎలా తీయగలిగారు?:

    'దాసి' ఆల్ టైమ్ హిట్!, దొరల గడీల్లోనే పెరిగిన మీరు ఆ సినిమా ఎలా తీయగలిగారు?:

    ఆ రోజుల్లో అంటరానితనం చాలా ఎక్కువగా ఉండేది. అయితే మా నాన్న అలాంటివి పట్టించుకునే వాడు కాదు. అభ్యుదయవాది. నేను ఆరేడేళ్ల వయస్సులో ఉన్నప్పటికే మా ఇంట్లో అరవై, డెబ్భై మంది పనివాళ్లు ఉండేవారు. ఉదయాన్నే లేచి చలికాచుకునే వారు. నేను ఎప్పుడైనా పొద్దున లేస్తే వెళ్లి మంట దగ్గర కూర్చుంటే వాళ్లు దూరం జరిగేవాళ్లు. వాళ్లనూ, వాళ్ల పేదరికాన్నీ చూస్తే బాధనిపించేది.

     ఆ అనుభవంతోనే..:

    ఆ అనుభవంతోనే..:

    మా ఇంటి పక్కన గొల్లోళ్లు ఉండేవారు. మా ఇంట్లో తెలియకుండా వాళ్ల ఇంటికెళ్లి కూర్చుండేవాణ్ణి. మా చుట్టాల ఇంటికెళ్లినప్పుడు పనివాళ్లను బండ బూతులు తిట్టడం విన్నాను. ఆ అనుభవంతోనే 'మా ఊరు' సినిమాకు డైలాగులు రాశాను. అవన్నీ నేను విన్నవే.

     రామానాయుడుతో సినిమా:

    రామానాయుడుతో సినిమా:

    రామానాయుడుకు నాతో సినిమా తీయాలని చాలా కోరిక. ఏదో కథ అనుకున్నాం కానీ కుదరలేదు. ఒకసారి చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వెళ్లాము. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల సినిమాలకు అప్పట్లో సబ్సిడీ కూడా ఇస్తోంది. చేస్తే మనం బాగుంటుందేమో అని అడిగితే 'మీరు రేపే రండి! మాట్లాడదాం' అన్నారు. నేను చెప్పిన కథ నచ్చింది. అలా 'హరివిల్లు' సినిమా రూపుదిద్దుకుంది.

    English summary
    Director B.Narsing Rao opined that we should not compare Rajamouli's Bahubali with hollywood. He added it's not that much range.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X