Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అలా జరిగితే ఆ హీరోలందరూ ఔట్: సెక్సువల్ హరాస్మెంటుపై హీరోయిన్ సంచలనం!
Recommended Video
హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన తర్వాత సినిమా ఇండస్ట్రీల్లో సెక్సువల్ హరాస్మెంటు మీద చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తన తాజా సినిమా 'ఫక్రే రిటర్న్స్' ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రీచా చద్దా బాలీవుడ్లో సెక్సువల్ హరాస్మెంట్ పై స్పందించారు.
బాలీవుడ్‌లోనూ ఉంది
హాలీవుడ్ తరహాలోనే బాలీవుడ్‌లోనూ సెక్సువల్ హరాస్మెంట్ సంఘటనలు, కాస్టింగ్ కౌచ్ లాంటివి చోటు చేసుకుంటున్నాయని రీచా చద్దా తెలిపారు.
నోరు విప్పితే ఆ హీరోలంతా ఔట్
బాలీవుడ్‌లోని హీరోయిన్లు, నటీమణులు మొత్తం ఏకతాటిపైకి వచ్చి సెక్సువల్ హరాస్మెంట్, కాస్టింగ్ కౌచ్ లాంటి వాటి మీద నోరు విప్పితే.... చాలా మంది హీరోలను మనం కోల్పోతాం. పలువురు తమ జీవితాలను, పనిని, లెగసీని కోల్పోతారు అని రీచా చద్దా సంచలన కామెంట్స్ చేశారు.
వారి పని కూడా అయిపోతుంది
అయితే మన దేశం పరువు పోయే రీతిలో బాలీవుడ్లో అలాంటివి ఇప్పట్లో చూస్తానని భావించడం లేదు. అలాంటివి జరిగినపుడు ఫెమినిస్ట్ ఫిల్మ్ తీస్తూ తాము ప్రగతిశీలురమని చెప్పుకుంటున్న వారు కూడా కిందకి పడిపోవడం ఖాయం అని రీచా చద్దా తెలిపారు.
ఎక్కడైనా అదే పరిస్థితి
రీచా చద్దా చెబుతున్న దాన్ని బట్టి హాలీవుడ్లో మాత్రమే కాదు... ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని స్పష్టమవుతోంది. అయితే హాలీవుడ్ తరహాలో అందరూ ఒకేసారి బయటకు వచ్చి చెప్పినపుడే హార్వీ వెయిన్స్టాన్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.