ఎన్టీఆర్ లోని ఫైర్ ని పూర్తిగా బయిటకు...
ఇందులో ఎన్టీఆర్‌ది చాలా శక్తివంతమైన పాత్ర. ఎన్టీఆర్‌లోని ఫైర్‌ను పూర్తిగా బయటకు తెచ్చే విధంగా 'శక్తి' రూపొందుతోందని నిర్మాత అశ్వనీదత్ చెబుతున్నారు. ఆయన జూ.ఎన్టీఆర్ తో తాజాగా నిర్మిస్తున్న 'శక్తి' సినిమా గురించి వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే...35 ఏళ్ల వైజయంతీ సంస్థ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిదని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే లాండ్ మార్క్ గా నిలిచిపోయే విధంగా దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
ఇంకా 'శక్తి' సినిమా ప్రోగ్రెస్ గురించి ఆయన వివరిస్తూ- "నెల రోజుల పాటు కులుమనాలి, హృషికేష్, హరిద్వార్, కాశ్మీర్ బోర్డర్ లలో భారీ షెడ్యూల్ చేశాం. ఈ షెడ్యూలులో ఎన్టీఆర్, ఇలియానాపై ఓ పాటను, ప్రధాన తారగణం పాల్గొన్న కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించాం. మళ్లీ ఈ నెల 27 నుంచి హైదరాబాద్ లో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రమిది' అని తెలిపారు.
ప్రభు, జాకీష్రాఫ్, పూజా బేడి, సోనూసూద్, నాజర్, అలీ, ఎం. ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, కృష్ణభగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్, కెమెరా: సమీర్‌రెడ్డి, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, సమర్పణ: సి.ధర్మరాజు.


Click it and Unblock the Notifications











