అంజలి... ఇలా చేస్తే నష్టం, సమస్య పరిష్కరిస్తాం రా: సురేష్ బాబు
సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ సంయుక్తంగా హిందీలో సూపర్ హిట్టయిన 'బోల్ బచ్చన్' మూవీని తెలుగులో వెంకటేష్, రామ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్ తో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలు తెరకెక్కించిన కే. విజయ భాస్కర్ ఈ సినిమాకి దర్శకుడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగుళూరులో జరుగుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్ ఎంపికయింది. ఇప్పటికే ఆమె షూటింగులో జాయిన్ అవ్వాల్సి ఉండగా నిర్మాతలకు అందుబాటులోకి రాలేదు. దీంతో సురేష్ బాబు అంజలి తీరుపై అసహనం వ్యక్తం చేసారు.
కాగా... ఈ రోజు ఉదయం అంజలి అజ్ఞాతం వీడింది. తన తల్లికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు వెల్లడించింది. తాను క్షేమంగానే ఉన్నానని, కావాలనే అజ్ఞాతంలోకి వెళ్లానని వెల్లడించింది. అంజలి క్షేమంగా ఉందని తేలడంతో... జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమె కనబడుట లేదు అని ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు కేసును విత్‌డ్రా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కేసు విత్రా చేసుకోవాలని అంజలి చెప్పినట్లు ఆమె తల్లి మీడియాకు వివరించింది.


Click it and Unblock the Notifications












