వీకైపోయిన స్టార్ దర్శకుడి సినిమా!
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ సినిమాలు విడుదలవుతున్నాయంటే తెలుగునాట ఉండే సందడి అంతా ఇంతా కాదు. తెలుగు టాప్ దర్శకులకు మించిన అంచనాలు ఆయన సినిమాపై ఉంటాయి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు, రోబో లాంటి సినిమాలు ఇక్కడ భారీ విజయం సాధించడంతో పాటు కోట్లాది రూపాయల వసూళ్లు సాధించాయి.
అయితే శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన 'స్నేహితుడు' సినిమాకు మాత్రం అసలు సందడి లేదనే చెప్పాలి. కారణం ఈ సినిమా హిందీ '3 ఇడియట్స్' సినిమాకు రీమేక్ కావడమే. అమీర్ ఖాన్ నటించిన '3 ఇడియట్స్' సినిమాను చాలా మంది తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా పట్టణప్రాంత ప్రేక్షకులంతా చూసేసారు కూడా. దీంతో అదే సినిమాను సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ రీమేక్ గా వస్తున్న'స్నేహితుడు' సినిమాపై ఆసక్తి కొరవడింది.
అయితే హిందీ సినిమాలు అంటే అస్సలు ఇష్ట పడని తమిళ ప్రేక్షకులు 3 ఇడియట్స్ సినిమాను చూడకుండా....'నన్‌బన్' సినిమాను భారీగా విజయవంతం చేశారు. విజయ్, ఇలియానా జంటగా నటిస్తున్న 'స్నేహితుడు' చిత్రం ఈ రోజు ఏపీలో విడుదలైంది. మరి సినిమా ఎన్ని రోజులు వరకు ఇక్కడి థియేటర్లలో నిలబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











