సందేహాలకు చెక్... చరణ్-ఉపాసన వెడ్డింగ్ వెబ్ సైట్
మెగా పవర్ సార్ రామ్ చరణ్, కామినేని వారి అమ్మాయి ఉపాసన జూన్ 14న మూడు ముళ్ల ద్వారా ఏకమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ మెగా వివాహ వేడుకకు పలువురు భారతీయ సినీ ప్రముఖులు, జాతీయ స్థాయి రాజకీయ నాయకులు హాజరు కానున్నారు.
రామ్ చరణ్, ఉపాసన వివాహ ఏర్పాట్లు, వారి మధ్య స్నేహం, పరిచయం, పెళ్లికి దారి తీసిన కారణాలు తదితర అంశాలపై సందేహాలు తొలగించేందుకు త్వరలో ఓ వెబ్ సైట్ అందుబాటులోకి రాబోతోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఉపాసన ఈ వెబ్ సైట్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె డొమైన్ కొని...వెబ్ సైట్ డిజైన్ చేయిస్తోందని సమాచారం అందుతోంది. పెళ్లికి వారం ముందు ఈదీన్ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో రామ్ చరణ్, ఉపాసనకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు, పెళ్లి ఏర్పాట్ల సంగతులు, ఫోటోలు, వీడియోలు అన్నీ ఉంటాయట. ఈ విషయం తెలిసిన వెంటనే మెగా అభిమానులు ఆ వెబ్ సైట్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చరణ్-ఉపాసన వివాహం మోయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఉపాసన ఫాంహౌస్‌లో జరుగబోతోంది. పెళ్లికి కేవలం చరణ్, ఉపాసన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఎంపిక చేయబడ్డ సినీ, రాజకీయ ప్రముఖులు, వివిఐపిలకు మాత్రమే ప్రవేశం ఉంది. ఎంట్రీ కోసం ఎలక్ట్రానిక్ పాస్‌లను ప్రవేశ పెట్టారు. సాధారణ జనాలకు, అభిమానులకు ఈ వేడుకలో చోటు లేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అభిమానుల కోసం పెళ్లి మరుసటి రోజు హైదరాబాద్‌లో భారీ విందుకు ఏర్పాటు చేసినట్లు చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











