ఫోటోలు : బాలయ్య చిన్నకూతురు పెళ్లి కుదిరింది
హైదరాబాద్ : ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని వివాహం నిశ్చయమైంది. గీతం గ్రూఫ్ (GITAM-Gandhi Institute of Technology and Management) అధినేత ఎంవీవీఎస్ మూర్తి పెద్ద కుమారుడు రామారావు తనయుడు శ్రీభరత్‌తో తేజస్విని వివాహం జరుగనుంది. ఆగస్టు మొదటివారంలో వీరి నిశ్చితార్థం జరుగనున్నట్లు తెలుస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే పెళ్లి కుమారుడు భరత్.... ఎంవీవీఎస్ మూర్తికి మాత్రమే కాదు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు కూడా మనవడే. భరత్ తల్లి కావూరి కుమార్తె. భరత్ అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసారు. ప్రస్తుతం భరత్ గీతం సంస్థ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి వివాహం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్న కూతురు పెళ్లి కూడా నిశ్చయం కావడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది......
భరత్-తేజస్విని ఫోటోలతో పాటు, బాలకృష్ణ ఫ్యామిలీ ఫోటోలు స్లైడ్ షోలో....

భరత్-తేజస్విని
గీతం గ్రూఫ్(GITAM-Gandhi Institute of Technology and Management) అధినేత ఎంవీవీఎస్ మూర్తి పెద్ద కుమారుడు రామారావు తనయుడు శ్రీభరత్‌తో తేజస్విని వివాహం జరుగనుంది. ఆగస్టు మొదటివారంలో వీరి నిశ్చితార్థం జరుగనున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ ఫ్యామిలీ
నందమూరి బాలకృష్ణ ప్రముఖ తెలుగు సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు. ఆయన భార్య పేరు వసుంధరదేవి. వీరికి ముగ్గురు సంతానం. కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ

చెన్నైలో బాలయ్య
బాలయ్య అప్పటి తమిళనాడు రాజధాని మద్రాసులో జన్మించారు. ఆయన బాల్యమంతా అక్కడే సాగింది. గతంలో మద్రాసు కేంద్రంగా తెలుగు సినిమా కార్యకలాపాలు జరిగేవి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులంతా అప్పట్లో మద్రాసులోనే నివాసం ఏర్పరుచుకున్నారు.

హైదరాబాద్‌కు షిప్టైన బాలకృష్ణ
యవ్వన దశకు చేరుకున్న తర్వాత బాలకృష్ణ మద్రాసు వదిలి హైదరాబాద్ షిప్ట్ అయ్యారు. ఇక్కడే నిజాం కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో పట్టా సాధించారు. అనంతరం ఆయన తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించి పాపులర్ హీరోగా మారారు.

బాలకృష్ణ వివాహం
22 ఏళ్ల వయసులోనే బాలకృష్ణ వివాహం వసుంధరా దేవితో జరిగింది. 1982లో వీరి వివాహం జరిగింది. బాలకృష్ణ-వసుంధర దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు బ్రహ్మాణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ. త్వరలో మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు.

బాలకృష్ణ పెద్ద కుమార్తె గురించి...
బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణి. విదేశాల్లో స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ, సాంతాక్లారా లాంటి ప్రఖ్యాత యూనివర్శిటీల్లో ఉన్నత చదువులు చదివి మంచి ప్రతిభ గల వ్యక్తిగా పేరు తెచ్చుకుంది. ఆమె వివాహం నారా లోకేష్‌తో జరిగింది.

బ్రాహ్మణి వివాహం
బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి వివాహం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో జరిగిన సంగతి తెలిసిందే. సినిమా కుటుంబంలో పుట్టినా ఆమె మొదటి నుంచి సినిమా ప్రపంచానికి దూరంగానే ఉంటోంది.

తేజస్విని
బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తం గ్రూఫ్ అధినేత ఎంవీవీఎస్ మూర్తి పెద్ద కుమారుడు రామారావు తనయుడు శ్రీభరత్‌తో తేజస్విని వివాహం జరుగనుంది. ఆగస్టు మొదటివారంలో వీరి నిశ్చితార్థం జరుగనున్నట్లు తెలుస్తోంది.

ఘనంగా తేజస్విని వివాహం
తేజస్విని కుటుంబంతో పాటు అటు వరుడు భరత్ కుటుంబం కూడా సామాజికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న కుటుంబాలు కాబట్టి వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది. త్వరలో వివాహ తేదీ నిశ్చయం కానుంది.

బాలయ్య తనయుడు మోక్షజ్ఞ
బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తండ్రి సినీ వారసత్వంతో త్వరలో మోక్షజ్ఞ హీరోగా తెరంగ్రేటం చేయబోతున్నారు. త్వరలో ఆయన తెర్రంగ్రేటానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











