నిశ్చితార్దం కి పిలవలేకపోయా...పెళ్లికి రండి
హైదరాబాద్ :సాయికుమార్ కొడుకు ఆది త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రికి చెందిన అరుణతో ఏడడుగులు వేయబోతున్నాడు. అందుకు ముహూర్తమూ కుదిరింది. డిసెంబరు 13న హైదరాబాద్‌లో ఆది-అరుణల వివాహానికి పెద్దలు నిశ్చయించారు.
సాయికుమార్ మాట్లాడుతూ ''ఏడో చిత్రానికి చేరువైన ఆది, ఇప్పుడు అరుణతో ఏడడుగులు వేయబోతున్నాడు. వచ్చే నెల 13వ తేదీన ముహూర్తం నిర్ణయించాం. మా అబ్బాయికి మీ అందరి ఆశీస్సులు కావాలి '' అన్నారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరుణతో ఇటివలే నిశ్చితార్ధం చేసుకున్న యంగ్ హీరో ఆది, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసేశాడు. డిసెంబర్ 13న హైదరాబాద్ లో ఆది వివాహం జరుగుతుంది. ఇరువురి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన నిశ్చితార్ధ వేడుకకు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్నేహితులను కూడా పిలవడం కుదరలేదు. చాలా గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్ 13న జరిగే పెళ్ళికి మాత్రం అందరిని ఆహ్వానిస్తున్నాను. అని ఆది అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అరుణ తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులేనని ఆది అన్నాడు. తన అక్కడ అత్తమామల ద్వారా ఈ సంబంధం వచ్చిందని వివరించాడు. దాంతో ఆది ప్రేమ వివాహం చేసుకుంటున్నాడన్న కథనాలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఆది నటించిన 'రఫ్' సినిమా విడుదల కావాల్సి ఉంది.
హీరోగా తెరంగేట్రం చేసి, 'ప్రేమ కావాలి', 'లవ్‌లీ' విజయాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు ఆది. ఇప్పుడు తన జీవితంలో మరో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. ఇటీవల విడుదలైన గాలిపటం సినిమాతో సక్సెస్ కూడా చూశాడు. త్వరలోనే అతడు నటించిన రఫ్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇప్పుడు మళ్లీ గరమ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఫైట్లు, డాన్సులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్న ఆది.. ఇప్పుడు పెళ్లికొడుకుగా సరికొత్త పాత్ర పోషించబోతున్నాడు.
ఆది కొత్త చిత్రం గరమ్ గురించి...
సినిమా గురించి ఆది తెలియజేస్తూ ''టైటిల్ చాలా హాట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సంభాషణలు కూడా చాలా బాగుంటాయి. శ్రీనివాస్ మంచి కథ ఇచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు.
మదన్ మాట్లాడుతూ ...'నా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ కథ అందించారు. చాలా బాగుంది. నిర్మాతకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఫిలిం మేకింగ్ మీద చాలా క్లారిటీ ఉంది. సమస్యలను అలవోక గా అధిగమించి ముందుకు సాగే ఓ కుర్రాడి కథ ఇది. ప్రేమతో దేన్నయినా సాధించొచ్చన్నది ప్రధాన ఇతివృత్తం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది'' అని తెలిపారు.
ఈచిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా - సురేందర్ రెడ్డి.టి, సంగీతం - ఆగస్త్య, కళ - నాగేంద్ర, ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - బి.నాగిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: హరికృష్ణ జి., కో-డైరెక్టర్ - అనిల్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మదన్.


Click it and Unblock the Notifications











